ఇంజనీరింగ్ కార్మికుల సమ్మెకు వైయ‌స్ఆర్‌సీపీ సంఘీభావం

మ‌ద్ద‌తు తెలిపిన మాజీ ఎమ్మెల్యే న‌ల్ల‌గ‌ట్ల స్వామిదాస్‌

కృష్ణా జిల్లా: తిరువూరు మున్సిపల్ కార్యాలయం వద్ద ఇంజనీరింగ్ కార్మికులు చేప‌ట్టిన నిరవధిక సమ్మె కు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ‌ద్ద‌తు తెలిపింది. ఈ మేర‌కు సోమ‌వారం వైయ‌స్ఆర్‌సీసీ నేత‌, మాజీ ఎమ్మెల్యే న‌ల్ల‌గ‌ట్ల స్వామిదాస్ కార్మికుల దీక్షా శిబిరాన్ని సంద‌ర్శించి సంఘీభావం ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..ఇంజనీరింగ్ కార్మికులకు జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు చెల్లించాలని, షరతులు లేకుండా ఇంజనీరింగ్, పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలన్నారు. కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, వయోపరిమితి 62 ఏళ్ళకు పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని స్వామిదాస్‌ డిమాండ్ చేశారు. ఇంజ‌నీరింగ్ కార్మికుల స‌మ్మెకు వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు, కౌన్సిల‌ర్లు మ‌ద్ద‌తు తెలిపారు .

Back to Top