ఆస్ట్రేలియాలో ఘనంగా డాక్టర్ వైయ‌స్ఆర్ జయంతి వేడుకలు

తాడేప‌ల్లి:   డాక్టర్ వైయ‌స్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆస్ట్రేలియా, అడెలైడ్ వారి ఆధ్వ‌ర్యంలో పెదల పెన్నిధి మన అందరి మహా నాయకుడు స్వర్గీయ డాక్టర్ వై య‌స్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు అస్ట్రేలియా దేశం అడెలైడ్ నగరం లో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సందర్బంగా వైయ‌స్ఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఫౌండేషన్ వారి ఆధ్వ‌ర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. డాక్టర్ వై య‌స్ రాజశేఖర రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా క్విజ్ కార్యక్రమం నిర్వహించారు తరువాత క్విజ్ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
 
ఈ కార్యక్రమానికి ఫెడరల్ ఎంపీ టోనీ జప్పియా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజేంద్ర పాండే (విశ్వ హిందూ పరిషత్), ఆది రెడ్డి యారా (అడిలైడ్ తెలంగాణ అసోసియేషన్) ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.
 
వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కారుమూరి నాగేశ్వరరావు , పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆలూరి సాంబశివారెడ్డి వ‌ర్చువ‌ల్‌గా హాజ‌రై శుభాకాంక్ష‌లు తెలిపారు.  అడిలైడ్‌లో నివసిస్తున్న తెలుగు వారందరూ ఈ వేడుకలకు హాజరై, డాక్టర్ వైయస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల నుండి తాము పొందిన ప్రయోజనాలను మరియు వారి అనుభవాలను పంచుకున్నారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ వై య‌స్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ కమిటీ సభ్యులు వంశీ బొంతు, రామ్ మోహన్ రెడ్డి మునగాల, కిషోర్ అనుమోలు, ఉదయ్ కుంధం, వెంకట నవీన్ గుర్రాల మాట్లాడుతూ  ఈ ఫౌండేషన్  స్థానిక సమాజానికి మరియు భారతీయ సమాజానికి ప్రయోజనం చేకూర్చే కార్యకలాపాలను చేస్తుందని మరియు డాక్టర్ వైయస్ఆర్ సూత్రాలు, విలువలు మరియు ప్రజలకు సేవ చేయడంలో ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు.  కార్యక్రమానికి వైయ‌స్ఆర్‌సీపీ లీడర్స్ విజయ్ వంగ, చారీ ఆలేట, వర్ధన్ రెడ్డి రేగళ్ల, అర్వింద్ రెడ్డి బైక త‌ద‌త‌రులు పాల్గొన్నారు. 

Back to Top