వైయ‌స్ఆర్‌సీపీ మంచి నాయకుడిని కోల్పోయింది

 మదన్ మోహన్ రెడ్డికి నివాళులర్పించిన అనంత వెంక‌ట్రామిరెడ్డి

అనంతపురం :  వైయ‌స్ఆర్‌సీపీ పంచాయితీ రాజ్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తపోవనం కు చెందిన బి.మదన్ మోహన్ రెడ్డి మరణం  వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి తీరనిలోటని  పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. తపోవనంలో మ‌ద‌న్ మోహ‌న్ రెడ్డి పార్థివదేహానికి అనంత వెంకటరామిరెడ్డి నివాళి అర్పించారు. సందర్భంగా అనంత మాట్లాడుతూ.. మంచి నాయకుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ పటిష్టతకు ఎంతో కృషి చేశారని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Back to Top