తాడేపల్లి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్‌సీపీ ఘనంగా నిర్వహించింది. వైయస్ఆర్ విగ్రహాలకు, పార్టీ కార్యాలయాల్లో చిత్రపటాలకు పార్టీ నేతలు నివాళులర్పించారు. మరపురాని మహానేతను స్మరించుకుంటూ.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. విస్తృతంగా సేవా కార్యక్రమాలు, రక్తదాన, అన్నదాన శిబిరాలు నిర్వహించారు. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. వైయస్సార్ ఒక వైద్యుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. క్రింది స్థాయి నుండి అంచలంచెలుగా ఎదిగిన మహానేత ఆయన. రెండుసార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆయన అందరి లాంటి ముఖ్యమంత్రి కాదు. స్వయంగా ప్రజాబలం కలిగిన నాయకుడు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు వైఎస్సార్ అంటే నచ్చని ప్రభుత్వం వచ్చినా వాటిని పక్కన పెట్టలేకపోయారు. సుదీర్ఘమైన దూర దృష్టితో వైయస్సార్ సంక్షేమ పథకాలు అమలు చేశారు. పేదరికం వలన విద్య మధ్యలో ఆగకూడదని ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చారు. పేదవాడు కూడా ఉన్నత హాస్పిటల్ వెళ్లి వైద్య సేవలు పొందాలని ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంగీకరించకపోయినా రైతులకు ఉచిత విద్యుత్ అందించారు. నేడు ఎక్కడ రోడ్డు ప్రమాదం జరిగిన నిమిషాల వ్యవధిలో అంబులెన్స్ వస్తుందంటే అది వైయస్సార్ కృషి. ప్రజలకు ఏది అవసరమో అది గుర్తించి వాగ్దానం చేసి, అమలు చేసిన నాయకుడు వైయస్సార్.. మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ.. ఒక సంతకం ఆటోగ్రాఫ్‌గా మారిందంటే అది వైయస్సార్ వలనే. వైయస్సార్ భౌతికంగా దూరమై మనకు దూరమైన ఆయన ప్రజల గుండెల్లో సజీవంగా బతికే ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి మరణం లేని మహానేత. రాజశేఖర్ రెడ్డి పుట్టింది ఆయన కుటుంబం కోసం కాదు, పేద బడుగు బలహీనవర్గాల కోసం. 2029లో వైఎస్ జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవడం ద్వారానే వైఎస్సార్ పాలన సాధ్యమవుతుంది. గుంటూరు తాడేపల్లి.. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వైఎస్సార్ జయంతి కార్యక్రమం వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పార్టీ నేతలు కేక్ కట్ చేసిన వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి , ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మాజీ మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, జోగి రమేష్ ,ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వైఎస్సార్ పేద ప్రజల చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి పేదలు మెరుగైన ఆరోగ్యం పొందుతున్నారంటే అది వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ వల్లే వైఎస్సార్ ఆశయాలను వైఎస్ జగన్ కొనసాగించారు మళ్లీ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తేనే వైఎస్సార్ ఆశయాలు కొనసాగుతాయి జోగి రమేష్ మాట్లాడుతూ.. తన పాదయాత్రతో భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిన నాయకుడు వైఎస్సార్ 2009లోనూ కాంగ్రెస్ ను నిలబెట్టింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ,నయవంచకుడు చంద్రబాబు కలిసి వైఎస్సార్ బిడ్డ జగనన్నను ఇబ్బంది పెట్టారు జగనన్న తన పాలనతో భారదేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శమయ్యాడు తల్లికి వందనం పథకం ఇచ్చి చంద్రబాబు తల్లడిల్లిపోతున్నాడు ఎప్పుడు ఎన్నికలొచ్చినా మళ్లీ వచ్చేది వైఎస్సార్‌సీపీనే విజయవాడ నగర మేయర్,రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. మా కులానికి దేవుడు వైఎస్సార్ ఓసీ కులంలో ఉన్న మేం 40 ఏళ్లుగా పోరాడారు ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చినా మాకు న్యాయం జరగలేదు తొలిసారి ముఖ్యమంత్రి కాగానే వైఎస్సార్ మమ్మల్ని బిసిల్లో చేర్చారు రాజకీయంగా మాకు అవకాశాలొచ్చాయంటే...మా పిల్లలు చదువుకుంటున్నారంటే వైఎస్సార్ చలవే తండ్రిబాటలో నడిచిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి నేను విజయవాడ నగరానికి మేయర్ అయ్యానంటే అది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వల్లే సమిష్టి కృషితో విజయవాడ నగరపీఠాన్ని దక్కించుకున్నాం నిన్న స్టాండింగ్ కమిటీలో ఏకగ్రీవంగా ఆరుస్థానాలు దక్కించుకున్నాం వచ్చే ఎన్నికల్లో సమిష్టిగా కలిసి పనిచేసి జగన్ మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించుకుందాం మాజీ ఎమ్మెల్యే, మల్లాది విష్ణు మాట్లాడుతూ.. వైఎస్సార్ ప్రజల నాయకుడు వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు వ్యవసాయాన్ని పండగ చేసి చూపించిన వ్యక్తి వైఎస్సార్ రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన నాయకుడు వైఎస్సార్ వైఎస్సార్ తెచ్చిన సంక్షేమం తొలగించే ధైర్యం ఎవరూ చేయలేరు జగన్ మోహన్ రెడ్డిని చూసి ఈ కూటమి ప్రభుత్వం భయపడుతోంది వైఎస్సార్ ఆశయాలను కొనసాగించేలా వైఎస్ జగన్ ను మళ్లీ గెలిపించుకుందాం మాజీ ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. జగనన్న హయాంలో రాజశేఖరుడి సంక్షేమ పాలన చూశాం ప్రస్తుతం ఈ రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది రాష్ట్రంలో పరిస్థితులు ఎమర్జెన్సీని తలపిస్తున్నాయ్ మళ్లీ వైఎస్సార్ పాలన కావాలంటే జగన్ మోహన్ రెడ్డిని సీఎంగా చేసుకోవాలి రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ ఎంతో మహోన్నతమైన వ్యక్తి ఎవరైనా కష్టాల్లో ఉంటే వారికి వైఎస్సార్ అండగా ఉండేవారు నేనున్నాను అనే ధైర్యం అందరిలోనూ కల్పించిన వ్యక్తి వైఎస్సార్ అనేక రాష్ట్రాల్లో వైఎస్సార్ గురించి నాయకులు గొప్పగా చెప్పుకునే వారు వైఎస్సార్ ఆలోచనలను వైఎస్ జగన్ ముందుకు తీసుకెళ్లారు వైఎస్సార్ రైతు రాజ్యం.. రామరాజ్యం రావాలంటే మనమంతా జగన్ మోహన్ రెడ్డికి అండగా నిలవాలి వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేనంత మంచి చేసిన నాయకుడు వైఎస్సార్ సంక్షేమం,అభివృద్ధి రెండు కళ్లలా భావించి పాలన అందించారు ఉచిత విద్యుత్ తో ఎంతో మంది రైతులు మేలు పొందారు రెండు తెలుగు రాష్ట్రాల రైతుల గుండెల్లో వైఎస్సార్ నిలిచిపోయారు పేదవాడికి విద్య,వైద్యం అందుబాటులోకి తెచ్చింది వైఎస్సార్ దేశంలోనే ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టిన తొలిరాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఫీజురీయింబర్స్ మెంట్ వల్ల ఎంచో మంది విద్యావంతులయ్యారు... విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు ప్రజలకు మేలైన సంక్షేమం అందించారు కాబట్టే వైఎస్సార్ అందరి గుండెల్లో నిలిచిపోయారు రెండు పర్యాయాలు కాంగ్రెస్ ను జాతీయస్థాయిలో నిలబెట్టింది వైఎస్సార్ వైఎస్సార్ ఆశయాల సాధనకోసం ఏర్పాటైన పార్టీ వైఎస్సార్‌సీపీ తండ్రి పాలనను మరిపించేలా సంక్షేమం అందించిన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి తండ్రి నాలుగు అడుగులు వేస్తే కొడుకుగా జగన్ 10 అడుగులు ముందుకు వేశారు విద్య,వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు అందరికీ మెరుగైన వైద్యం అందించాలని మెడికల్ కాలేజీలను తెచ్చారు రైతే రాజులా ఉండాలని వైఎస్సార్,జగన్ పాలన అందించారు కూటమి పాలనలో అరాచకం కొనసాగుతోంది కక్ష సాధింపుకే అధికారాన్ని వాడుకుంటున్నారు అన్ని వర్గాల వారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు కూటమి అరాచకాలను తిప్పికొట్టేలా పోరాడదాం కాకినాడ జిల్లా పిఠాపురంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగా గీతా ప్రత్తిపాడు లో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు మెగా రక్తదాన శిభిరాన్ని ప్రారంభించిన నియోజకవర్గ ఇన్చార్జ్ ముద్రగడ గిరిబాబు ఒమ్మంగిలో వైఎస్ఆర్ విగ్రహనికి పూలమాలలు వేసి..పేదలకు వస్త్రాలు పంపిణీ చేసిన గిరిబాబు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గ వ్యాప్తంగా దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు. పట్టణంలో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు. గ్రామ గ్రామాన పండుగ వాతావరణం లో వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి పాఠశాలలలో విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేసిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి వేడుకలు. పట్టణంలో ఉన్న మహానేత వైఎస్ఆర్ విగ్రహాలకు పార్టీ శ్రేణులతో కలిసి నివాళులు అర్పించిన ఇంచార్జ్- నల్లగట్ల స్వామిదాస్.. పార్టీ నాయకులు కార్యకర్తలు సమక్షంలో కేకు కట్ చేసి, మిఠాయిలు పంపిణీ.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పార్లమెంటరీ ఇంచార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైఎస్సార్ జన్మదిన వేడుకలు హాజరైన మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు.. జక్కంపూడి రాజా కామెంట్స్ రాజకీయాల్లో మానవీయ కోణాన్ని జోడించి పరిపాలన చేసిన మహోన్నతుడు వైయస్సార్ ఆయన ఆశయాల కోసం పనిచేస్తున్న పార్టీ వైఎస్ఆర్సిపి కచ్చితంగా వైఎస్ఆర్సిపిని అధికారంలోకి తెచ్చుకుంటాం డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కామెంట్స్... వైయస్సార్ అంటే ముందుగా గుర్తుకొచ్చేది ఆరోగ్యశ్రీ... పేద వర్గాల ఆర్థిక స్వావలంబనకు వైఎస్ఆర్ ఎంతగానో కృషి చేశారు వైయస్సార్ ఆశయ సాధన కోసం ప్రారంభమైన పార్టీ వైఎస్ఆర్సిపి రానున్న రోజులో వైఎస్ఆర్సిపిని మరింత బలోపేతం చేసుకుంటాం విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన వైఎస్ఆర్సిపి శ్రేణులు వైయస్సార్ జయంతి సందర్భంగా 76 కేజీల కేక్ కట్ చేసిన వైస్సార్సీపీ శ్రేణులు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, జోగి రమేష్ మాజీ ఎమెల్యే మల్లాది విష్ణు, వైస్సార్సీపీ స్టేట్ సెక్రటరీ ఆసీఫ్ , రాయన భాగ్యలక్ష్మి, వైఎస్సార్‌సీపీ, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు.. వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ మంత్రి మాట్లాడుతూ.. వైఎస్సార్ జయంతిని ఓ ఉత్సవంలా నిర్వహిస్తున్నాం అనేక సంక్షేమ పథకాలు పెట్టిన నేత వైఎస్సార్ విదేశాల్లో విద్యార్థులు చదువుకుంటున్నారు అంటే అదే రాజశేఖర్ రెడ్డి వల్లనే.. 40ఏళ్ళు అనుభవం అన్న చంద్రబాబు పాలన ప్రజలు చూస్తూనే వున్నారు.. రాజశేఖర్ రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకొని వెళ్లే వ్యక్తి జగన్.. జోగి రమేష్, మాజీ మంత్రి ప్రపంచంలో ఉన్న తెలుగు వారు గౌరవించే వ్యక్తి రాజశేఖర్ రెడ్డి.. పేద ప్రజలు పెద్ద పెద్ద చదువులు చదివారంటే దానికి కారణం వైయస్సార్ మల్లాది విష్ణు, మాజీ MLA తెలుగుజాతి ముద్దుబిడ్డ రాజశేఖర్ రెడ్డి గారు.. సుదీర్ఘమైన పాదయాత్ర చేసి అనేక సంస్కరణలు తీసుకొచ్చారు.. అనారోగ్యం పాలైన పాదయాత్ర ని కొనసాగించారు.. తెలుగుదేశం వ్యవసాయం దండగ అంటే వ్యవసాయాన్ని పండగ చేసిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యుత్ ద్వారా రైతులకు ఎంతో మేలు చేసిన వ్యక్తి.. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉచిత విద్యుత్ పథకం కొనసాగుతుందంటే దానికి కారణం రాజశేఖర్ రెడ్డి. 1200 కోట్లు రూపాయలు తొలి సంతకం తోనే రైతుల బకాయిలు రద్దు చేసిన వ్యక్తి ఫీజు రియంబర్స్‌మెంట్ ప్రవేశపెట్టి విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు కృష్ణాజిల్లా ముఖ చిత్రాన్ని మార్చిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి అనేక ప్రాజెక్టులు తీసుకురావడంతో పాటు మచిలీపట్నం పోర్ట్ కి శంఖుస్థాపన చేశారు.. తెల్ల రేషన్ కార్డు ఉంటే చాలు ఆపరేషన్ చేయించుకొచ్చే అవకాశం కల్పించారు న్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను వైఎస్ఆర్సిపి ముందు తీసుకొని వెళ్తుంది.. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యం చెందింది.. రాష్ట్రాన్ని అప్పులు పని చేస్తుంది.. ఎమ్మెల్యేలు పూర్తిగా అవినీతి అక్రమాలు చేస్తున్నారు అన్ని రంగాల ప్రజల నుంచి ఓటమి ప్రభుత్వం చిత్కారం ఎదుర్కొంటుంది రాయన భాగ్యలక్ష్మి , నగర మేయర్.. ఘనంగా రాజశేఖర్ రెడ్డి గారి జయంతి వాడవాడల చేస్తున్నారు.. రాజశేఖర్ రెడ్డి కంటే ఒక అడుగు ముందుకు వేసి సంక్షేమం ఎక్కువ అందించారు రాజశేఖర్ రెడ్డిని చూసిన జగన్మోహన్ రెడ్డి గారిని చూసిన సంక్షేమ పథకాలు గుర్తు వస్తాయి.. చంద్రబాబును చూస్తే గుర్తొచ్చే ఒక సంక్షేమ పథకము లేదు రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ పథకాలను మాత్రమే పేర్లు మార్చి చంద్రబాబు అమలు చేస్తాడు షేక్ అసిఫ్, వైఎస్సార్సీపి రాష్ట్ర కార్యదర్శి కూటమి పాలనలో చేశామని చెప్పుకోవడానికి ఎమ్ లేదు.. శత్రువు సాయమడిగిన చేసిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి మీ వస్తున్నాయి పథకాలు రాలేదని ప్రజలు అడిగితే మాట దాటవేస్తున్నారు బడుగు బలహీన వర్గాలకు రాజశేఖర్ రెడ్డి అండగా నిలించారు.. పేద ప్రజల పిల్లలకు ఉన్నత స్థానాలు గెలుగా అంటే దానికి కారణం రాజశేఖర్ రెడ్డి మాత్రమే.. సంక్షేమ అమలు చేయడంలో రాజశేఖర్ రెడ్డి ఒక అడుగు ముందుకు వేస్తే జగన్మోహన్ రెడ్డి రెండు అడుగులు ముందుకేసారు ఇటువంటి నాయకుడిని పోగొట్టుకున్న అంటూ ప్రజలు మాట్లాడుకుంటున్నారు.. పవన్ కల్యాణ్ దోచుకోండి దాచుకోండి అంటూ మాట్లాడుతున్నారు.. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో.. మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 76 వ జయంతి వేడుకలు మాజీ మంత్రి, మైలవరం నియోజకవర్గం సమన్వయకర్త జోగి రమేష్ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి ఘన నివాళి కృష్ణా జిల్లా డా. వైఎస్ రాజశేఖరరెడ్డి 76 వ జయంతి సందర్భంగా ఉయ్యూరు బస్ స్టాండ్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి,కేక్ కట్ చేసిన వైఎస్సార్ సీపీ నాయకులు, శ్రేణులు, అభిమానులు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు వాడవాడలా వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలతో నివాళులు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి,వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు,నాయకులు,కార్యకర్తలు గుంటూరు తాడేపల్లిలో.. వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు తాడేపల్లి వైఎస్సార్ సెంటర్ లో వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించిన వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ సభ్యులు పాల్గొన్న వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మనోహర్ రెడ్డి , మంగళగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇంఛార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి , వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ సభ్యులు పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి వైఎస్సార్ ఎంతమంది నేతలున్నా వైఎస్సార్ కు ప్రజల మనసులో ప్రత్యేకమైన స్థానం దక్కింది పేదలకు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చిన వ్యక్తి వైఎస్సార్ ఏ ప్రభుత్వమూ తీసివేయలేని సంక్షేమ పథకాలను వైఎస్సార్ ప్రవేశపెట్టారు రైతులను ఆదుకున్న రైతు పక్షపాతి వైఎస్సార్ పేద విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ద్వారా ఉన్నత విద్యను అందించారు వైఎస్సార్ ఆశయాలను ఆయన తనయుడిగా జగన్ మోహన్ రెడ్డి కొనసాగించారు ఏపీలో ప్రస్తుతం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు...ఇళ్ల పై దాడులు చేస్తున్నారు అన్ని వ్యవస్థలను నాశనం చేశారు వైఎస్సార్‌సీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే మన ముందున్న కర్తవ్యం వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మనోహర్ రెడ్డి ప్రకటన విశాఖపట్నం విశాఖ నగర వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఘనంగా దివంగత నేత వైయస్ జన్మదిన వేడుకలు. వైయస్ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించిన పార్టీ నాయకులు. కేక్ కట్ చేసిన ఎంపీ గొల్ల బాబురావు విశాఖ నగర అధ్యక్షుడు కేకే రాజు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి.. యువజన విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. గొల్ల బాబురావు, రాజ్యసభ ఎంపీ.. దివంగత నేత డాక్టర్ వైఎస్సార్ జయంతి ఉత్సవాలు అన్ని ప్రాంతాల్లో ఘనంగా జరుగుతున్నాయి.. కేవలం 5 సంవత్సరాల 3 నెలల్లో దేశ చరిత్రలో ప్రజలకు ఎవరూ చేయనంత మంచి వైఎస్సార్ చేశారు.. వైఎస్సార్ లాంటి గొప్ప పాలనను జగన్ అందించారు.. జగన్ ను అడ్డుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు.. టీడీపీ, బీజేపీ,జనసేనకు అదే గతి పడుతుంది.. విద్యుత్ చార్జీలు పెంచేది లేదని ఎన్నికల ముందు చెప్పారు.. ఇప్పుడు విద్యుత్ చార్జీల బాదుడికి పాల్పడుతున్నారు.. జగన్ పాలన మళ్ళీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.. కేకే రాజు కామెంట్స్.. వైఎస్సార్ అంటే హుందాతనం.. ప్రత్యర్థులు సైతం కొనియాడేలా వైఎస్సార్ పాలన చేశారు.. సంక్షేమం, సంస్కరణ అంటే డా. వైఎస్సార్ పాలనలా ఉండాలని అనుకునేలా పాలించారు.. 5 సంవత్సరాల 3 నెలల పాలనతో రాష్ట్రాన్ని సుభిక్షం చేశారు.. ఈ భూమి ఉన్నంతకాలం వైఎస్సార్ పాలనను స్మరించుకుంటాం.. వైఎస్సార్ ఆశయాల సాధన కోసం జగన్ పని చేస్తున్నారు.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం వైఎస్ కుటుంబానికే చెందింది.. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ మాటకు కట్టుబడి జగన్ పాలన అందించారు.. వైఎస్సార్ ఆశయాలను ఆచరించి జగన్ ఆయన పాలనను మరిపించారు.. మహిళ, బీసీ వర్గాలకు జగన్ న్యాయం చేశారు.. వరుదు కళ్యాణి కామెంట్స్.. డా.వైఎస్సార్ స్వర్ణయుగ పాలన అందించారు.. పేద ప్రజల తమ గుండెల్లో వైఎస్సార్ కు గుడి కట్టుకున్నారు.. అన్ని వర్గాల వారు తామే ముఖ్యమంత్రి అయితే ఎలా పాలిస్తారో వైఎస్సార్ అలాంటి పాలన అందించారు.. రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న మళ్ళీ సీఎం కావాలి.. అల్లూరి జిల్లా ఘనంగా డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 76 వ,జయంతి వేడుకలు.. పాడేరులో దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి కాకినాడ జిల్లా.. తునిలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు. వైఎస్ఆర్ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అనంతపురం వైఎస్సార్ జయంతి సందర్భంగా పోలీసుల అత్యుత్సాహం వైఎస్సార్ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్తున్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు వైఎస్సార్ జయంతి వేడుకల్లో పాల్గొనరాదని ఆంక్షలు తాడిపత్రి నియోజకవర్గంలో జరిగే వైఎస్సార్ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని ఎస్పీ జగదీష్ కు లేఖ రాసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి, యాడికి, పెద్దవడగూరు మండలాల్లో ఏదో ఒక కార్యక్రమంలో హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోరిన పెద్దా రెడ్డి శింగనమల నియోజకవర్గం తిమ్మంపల్లిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి, పెద్దవడగూరు మండలాలకు వెళ్లొద్దని నోటీసులు జారీ చేసిన పోలీసులు తిరుపతిలో.. తిరుపతిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్ జన్మదిన వేడుకలు భారీ ఎత్తున నిర్వహించిన పార్టీ శ్రేణులు వైఎస్సార్ కటౌట్‌లతో నగరంలో కోలాహలం పాల్గొన్న భూమన అభినయ్, ఇతర వైఎస్సార్‌సీపీ నేతలు