ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతివ్వండి

వైయ‌స్ జ‌గ‌న్‌కు ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఫోన్

ఇండియా కూటమి అభ్యర్థిని ప్రకటించక ముందే ఎన్డీఏ నేతలు తమతో మాట్లాడారన్న వైయ‌స్ జగన్

ఎన్డీఏ అభ్యర్థన మేరకు ముందుగానే వారికి మాట ఇచ్చినట్లు వెల్లడి

వ్యక్తిగతంగా సుదర్శన్‌రెడ్డి అంటే ఎంతో గౌరవం ఉందన్న వైయ‌స్ జగన్

రాజ్యాంగ పరిరక్షణకు, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడేందుకు విశేష కృషి చేశారని కితాబు

తాడేప‌ల్లి: ఇండియా కూటమి తరఫున ఉప రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఆదివారం వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో పోటీ చేస్తున్న తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. వైయ‌స్ జగన్ స్పందిస్తూ.. ఇండియా కూటమి అభ్యర్థిని ప్రకటించడానికి ముందే.. తమ అభ్యర్థికి మద్దతివ్వాలంటూ ఎన్డీఏ కోరిన విషయాన్ని గుర్తు చేశారు. వారికి మద్దతిస్తానని మాట కూడా ఇచ్చినట్లు వైయ‌స్ జగన్ తెలిపారు. కాగా, వ్యక్తిగతంగా జస్టిస్ సుద ర్శన్‌రెడ్డి అంటే అపారమైన గౌరవం ఉందని.. ఆయన సేవలు దేశానికి అవసరమని వైయ‌స్ జగన్ పేర్కొన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడేందుకు విశేష కృషి చేశారని కొనియాడారు. కానీ ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థిగా పోటీలో ఉన్న ఆయనకు మద్దతు ఇవ్వలేకపోతున్నామని వైయ‌స్ జగన్ తెలిపారు. 

Back to Top