చంద్రబాబు అంతటి మోసగాడు దేశంలోనే ఎక్కడా లేడు

అనంత‌పురం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు అనంత వెంక‌ట్రామిరెడ్డి

అనంత‌పురం: చంద్రబాబు అంతటి మోసగాడు దేశంలోనే ఎక్కడా లేడని అనంత‌పురం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు అనంత వెంక‌ట్రామిరెడ్డి విమ‌ర్శించారు. కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఒంటిమిద్ది లో వైయ‌స్ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య ఆధ్వర్యంలో 'బాబు షూరిటీ-మోసం గ్యారెంటీ' కార్యక్రమం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథులుగా అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పి చైర్మన్ గిరిజమ్మ, పార్లమెంట్ పరిశీలకులు నరేష్ రెడ్డి, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొని ఇంటింటికీ వెళ్లి చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా  అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ...`౼ ప్రజలను ఎలా మోసం చేయాలో చంద్రబాబు కు బాగా తెలుసు. కూటమి మోసాలను ప్రజల్లోకి ముమ్మరం తీసుకుపోదాం.  14 నెలల్లో కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసింది శూన్యం. కూటమి నేతలు ఇస్తున్న అరకొర పథకాలు కూడా మన పోరాట ఫలితమే. నాడు దివంగత ముఖ్యమంత్రి వైయస్ఆర్‌ చొరవతో కళ్యాణదుర్గం, రాయదుర్గం లకు నీరు అందించాం. కుప్పానికి కృష్ణాజలాలు తీసుకుపోయాం అని స్థానిక ప్రజాప్రతినిధులు చంకలు గుద్దుకుంటుంన్నారు. కుప్పానికి నీళ్లు సరే.. మరి కళ్యాణదుర్గం లోని 114 చెరువుల సంగతి ఏంటి?.  ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలను మరచిపోయారా?.  అక్రమ కేసులకు కార్యకర్తలు ఎవ్వరూ భయపడొద్దు ప్రతి ఒక్కరికీ అండగా ఉంటాం` అనంత వెంక‌ట్రామిరెడ్డి హామీ ఇచ్చారు.

Back to Top