అనంతపురం : అనంతపురం నగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ నూతన సభ్యులు మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డిని ఆయన స్వగృహంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తమకు స్టాండింగ్ కమిటీలో అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలపై గళం విప్పితూనే అనంతపురం నగర అభివృద్ధికి కృషి చేయాలని అనంత వెంకటరామిరెడ్డి వారికి సూచించారు. అనంతను కలిసిన వారిలో స్టాండింగ్ కమిటీ సభ్యులు బి.లావణ్య, ఎం.దేవి, పి.రామాంజినమ్మ, కె.జయలలిత, జి.మల్లికార్జున ఉన్నారు. కాగా అనంతపురం కార్పొరేషన్‌లో స్టాండింగ్ కమిటీలోని ఐదు స్థానాలకు గత నెలలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఐదుగురు మాత్రమే నామినేషన్లు వేయడంతో వారంతా ఏకగ్రీవమయ్యారు. ఇదిలా ఉండగా అనంత వెంకటరామిరెడ్డి సృగృహంలో స్టాండింగ్ కమిటీ సభ్యులను వైయస్ఆర్‌సీపీ అనంతపురం పార్లమెంట్ పరిశీలకులు నరేష్‌రెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్ అభినందనలు తెలియజేశారు.