ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి పదవి లాక్కుని 30 ఏళ్ళు

మోసానికి, ద్రోహానికి బ్రాండ్ అంబాసిడర్‌గా చంద్రబాబు

మండిపడ్డ మాజీ మంత్రి సాకె శైలజానాథ్

అనంతపురం వైయస్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయస్ఆర్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సాకె శైలజానాథ్

టీడీపీకి నిజమైన వారసులు ఎవరో చంద్రబాబును కార్యకర్తలు ప్రశ్నించాలి

సొంత కుటుంబసభ్యులతో ఎన్టీఆర్‌కు ద్రోహం చేయించాడు

మనోవ్యథతో ఎన్టీఆర్ చనిపోయేందుకు చంద్రబాబు కారణం 

సీఎంగా చంద్రబాబు రాజకీయ జీవితం వైఫల్యాల పుట్ట

కనీసం రాయలసీమకు నీటిని అందించలేని అసమర్థ పాలకుడు

తన సొంత నియోజకవర్గం కుప్పానికే నీటిని తేలేకపోయాడు

వృద్ధులు, దివ్యాంగుల పెన్షన్లలో భారీ కోతకు కుట్రలు

ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి సాకె శైలజానాథ్

అనంతపురం: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీఆర్‌కు 30 ఏళ్ళ కిందట వెన్నుపోటు పొడిచి, ఆయన పదవిని లాక్కుని చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించారని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ సీనియర్ నేత సాకె శైలజానాథ్ మండిపడ్డారు. అనంతపురం వైయస్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... రాజకీయాల్లోనే అత్యంత నికృష్ణమైన ఈ ఘటనను తెలుగుదేశం శ్రేణులు అందరికీ ఆదర్శంగా కొనియాడుతుండటం ఆశ్చర్యం కలుగుతోందని అన్నారు. ఈ దేశంలోనే రాజకీయాల్లో మోసానికి, ద్రోహానికి, వెన్నుపోటుకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్‌గా అవతరించి 30 ఏళ్ళు అవుతోందని దుయ్యబట్టారు. మొత్తం చంద్రబాబు పాలనా కాలం, రాజకీయ జీవితంలో అత్యంత అసమర్థ పాలకుడుగా గొప్ప గుర్తింపును సాధించుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం తన సొంత నియోజకవర్గానికే కృష్ణాజలాలను అందించలేని విఫలనేత చంద్రబాబేనని ఆక్షేపించారు. ఇంకా ఆయనేమన్నారంటే...   

చంద్రబాబు సంపూర్ణ అధికారం చేపట్టి 30 ఏళ్ళు అయ్యిందని తెలుగుదేశం నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. ముప్పై ఏళ్ళ కిందట ఇదే రోజు ఆనాటి టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారిని వెన్నుపోటు పొడిచి, తన కుటుంబసభ్యులతోనే ఆయనకు ద్రోహం చేయించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యలు తీసుకున్నారు. వైశ్రాయి హోటల్ వద్ద ఆయనపై చెప్పులేయించి, ఆయన పదవిని లాక్కుని, ఆయనను తీవ్ర మనస్థాపానికి గురి చేసి, ఈ లోకం నుంచి ఆయన నిష్ర్కమించేందుకు కారకుడు చంద్రబాబు. అసెంబ్లీలో తన మనోభావాలను తెలియచేసేందుకు కూడా వీలు లేకుండా ఆయనను బయటకు పంపించిన దుర్మార్గులు. పేదల ఆకలి తీర్చాలని ఆనాడు ఎన్టీఆర్ కిలో రెండురూపాయలకే బియ్యం, సంపూర్ణ మద్య నిషేదం వంటి నిర్ణయాలను అమలు చేస్తే, సీఎం కాగానే వాటిని పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనుడు చంద్రబాబు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన స్వర్గీయ వైయస్ఆర్ కిలో రెండు రూపాయలకే సబ్సిడీ బియ్యం పథకాన్ని పునరుద్దరించారు. దానికి కొనసాగింపుగా కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఒక్క రూపాయికే కిలో బియ్యాన్ని అందించింది. సంపూర్ణ మద్యనిషేదాన్ని కొనసాగించాలన్న ఎన్టీఆర్ ఆశయాలకు తూట్లు పొడుతూ, ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాలనా కాలంలో ప్రతి వీధికి, ప్రతి గ్రామానికి ఒక బెల్ట్ షాప్‌ను ఏర్పాటు చేసి, మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చేశారు.

● రాజకీయ లబ్ధి కోసమే ఎన్టీఆర్ పేరు వాడుకుంటున్నారు

రాజకీయంగా లబ్ధి పొందేందుకు చంద్రబాబు నేడు ఎన్టీ రామారావు గారి పేరును వాడుకుంటున్నారు. ఆయన ఆశయాల పట్ల నిజంగా తెలుగుదేశం కార్యకర్తలకు నిబద్దత ఉంటే, తెలుగుదేశం పార్టీకి నిజమైన వారసులు ఎవరో చెప్పాలని చంద్రబాబును నిలదీయాలి. జూనియర్ ఎన్టీఆర్ తల్లిని అవమానిస్తుంటే, ఎందుకు చంద్రబాబు మౌనంగా ఉన్నారో చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో వెన్నుపోటు రాజకీయాలకు ఆధ్యుడు చంద్రబాబు. చంద్రబాబు అంటేనే వంచన, దోపిడీ, మోసం గుర్తుకు వస్తుంది. ఆనాటి ఎన్టీ రామారావు ఎలాగైతే ప్రజల కోసం ఆలోచించారో, అదే పరంపరలో ఆలోచనా విధానంను కలిగిఉన్నది వైయస్ఆర్‌, వైయస్ జగన్ మాత్రమే. ఎన్టీఆర్ పేరే టీడీపీ పార్టీ కార్యకర్తలు మరిచిపోయేలా వ్యవహరించిన దారుణమైన నైజం చంద్రబాబుది. 

● రాయలసీమకు నీటిని అందించలేని దుర్మార్గ పాలకుడు

రాయలసీమ నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారాన్ని అందించలేని దుర్మార్గమైన పాలకుడు చంద్రబాబు. హంద్రీనీవా సుజల స్రవంతి అనే పథకానికి పేరు పెట్టిందే ఎన్టీఆర్ అయితే, దానిని పూర్తి చేసింది వైయస్ రాజశేఖర్‌రెడ్డి, ఆయన తరువాత వచ్చిన ప్రభుత్వం. హంద్రీనీవాకు రెండు సార్లు సీఎంగా శంకుస్థాపన రాళ్ళు వేయడం తప్ప చంద్రబాబు ఆ ప్రాజెక్ట్‌ కోసం చేసింది ఏమీ లేదు. ఆ ప్రాజెక్ట్ కాలువలను వెడల్పు చేయాలని ఎన్నిసార్లు చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చినా ఆయన పట్టించుకోలేదు. రాయలసీమ దాహార్తిని, సాగునీటి కష్టాలను తీర్చాలని ఏనాడు ఆలోచించలేదు. కుప్పానికి నీటిని తీసుకువెళ్ళాలని సీఎంగా ఉండి కూడా చంద్రబాబు చిత్తశుద్దితో చర్యలు తీసుకోలేదు. చివరికి వైయస్ జగన్ సీఎం అయిన తరువాత 2024లో కుప్పం బ్రాంచి కెనాల్‌కు నీటిని విడుదల చేశారు. హంద్రీనీవా కాలువలకు లైనింగ్ లేకుండా కాలువలను వెడల్పు చేయాలని కోరాం. శ్రీశైలం నుంచి నీటిని వాడుకునే అవకాశం పూర్తి స్థాయిలో కల్పించాలంటే చంద్రబాబు దానికీ స్పందించలేదు. కాలువ పనులను కూడా అధిక రేట్లకు, తనకు కావాల్సిన వారికి కట్టబెట్టి కమీషన్లు దండుకున్న ఘనుడు చంద్రబాబు. 

● పెన్షన్ల కోతకు రంగం సిద్దం

రాష్ట్రంలో ఇప్పటికే లక్ష మంది దివ్యాంగులకు పెన్షన్లు తొలగిస్తామంటూ నోటీసులు జారీ చేశారు. రీవెరిఫికేషన్లలో పెద్ద సంఖ్యలో దివ్యాంగుల పెన్షన్లను తొలగిస్తున్నారు. వైద్యులపై ఒత్తిడి తెచ్చి, అంగవైకల్యం శాతాన్ని తగ్గించి వేస్తూ, పెన్షన్లను తొలగించే కుట్ర చేస్తున్నారు. వైయస్ జగన్ హయాంలో రెండు లక్షలకు పైగా కొత్త దివ్యాంగ పెన్షన్లు మంజూరు చేశారు. చంద్రబాబు కొత్త పెన్షన్లు ఇవ్వకపోగా, ప్రస్తుతం ఉన్న వాటిని కూడా తొలగించాలని కుట్ర చేస్తున్నారు. దివ్యాంగులు, వృద్దులకు ఇచ్చే పెన్షన్ల పైన కూడా చంద్రబాబు ఇంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడు.

Back to Top