వేగేశ్న ఆనందరాజు మృతి పట్ల వైయస్‌ జగన్‌ సంతాపం

పులివెందుల‌: రాజు వేగేశ్న ఫౌండేషన్‌ సంచాలకుడు వేగేశ్న ఆనందరాజు(67) మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌ సంతాపం వ్యక్తం చేశారు. వేగేశ్న ఫౌండేషన్‌ నిర్వహణలో ఆనందరాజు కీలకంగా వ్యవహరిస్తూ.. దాని ద్వారా దేశంలోని వివిధ ఆలయాల్లో భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు రూ.కోట్లు వెచ్చించారు. పేదలు, ఆపదలో ఉన్న కుటుంబాల్లో పిల్లల చదువుకు అవసరమైన నిధులు సమకూర్చారు. అనేక సంవత్సరాలుగా హైదరాబాద్‌లో, ఇటు విశాఖలో ఉంటూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ వచ్చారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్ధిస్తున్నామన్నారు. ఆనందరాజు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Back to Top