తాడేపల్లి: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర రెడ్డి గారి జయంతిని పురస్కరించుకొని, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశంలోని వైయస్ఆర్ అభిమానుల ఆధ్వర్యంలో మహమ్మద్ జిలాన్ భాష, అక్రమ్ బాషా, కోటేశ్వర్ రెడ్డి గార్ల నేతృత్వంలో దుబాయ్‌లోని సోనాపూర్ – బిన్ సనాద్ లేబర్ క్యాంప్‌లో మధ్యాహ్నం, ఓ అర్థవంతమైన సేవా కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించబడింది. కార్యక్రమ ప్రారంభంలో డాక్టర్ వైయస్ఆర్ గారి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ఆయన జయంతిని వేడుకగా నిర్వహించారు. తర్వాత 500 మందికి పైగా కార్మికులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా కార్మికులు ఉత్సాహంగా పాల్గొని వైఎస్సార్ గారి సేవా తత్వాన్ని గౌరవంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ఆకర్షణగా "యాత్ర-2" చిత్రం నిర్మాత శ్రీ శివ మేక గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలియజేస్తూ, “డాక్టర్ వైఎస్సార్ గారి సేవా దృక్పథాన్ని ప్రతిబింబించే ఈ కార్యక్రమం ఎంతో ప్రత్యేకమైనది. సమాజ హితానికి ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతుండడం ఎంతో గర్వకారణం,” అని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ప్రతి ఒక్కరినీ హృదయపూర్వకంగా అభినందించారు. ఈ సందర్భంగా యు.ఎ.ఇ. వైఎస్సార్సీపీ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, “డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు సామాన్య ప్రజల గుండెల్లో నిలిచిపోయిన నాయకుడు. ఆయన పాలనలో సామాజిక న్యాయం, సంక్షేమం నిజమైన రూపంలో అమలైంది. ఆయన జయంతిని సేవా కార్యక్రమాల రూపంలో జరపడం మాకు గౌరవకారణం,” అని అన్నారు. కార్యక్రమ విజయవంతానికి తన స్థలాన్ని వినియోగించేందుకు అవకాశం కల్పించిన సోనాపూర్ లేబర్ క్యాంప్ యజమాని శ్రీ మసూద్ అహ్మద్ గారిని శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో తమ సమయం, శ్రమ, నిబద్ధతను చాటిన మహమ్మద్ జిలాన్ భాష, అక్రమ్ బాషా, కోటేశ్వర్ రెడ్డి, ప్రసన్న సోమీ రెడ్డి, పవన్ కుమార్, కరుణాకర్, లోకనాథ్ రెడ్డి గార్ల కృషిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ నాయకులు మహమ్మద్ జిలాన్ భాష, అక్రమ్ బాషా, ప్రసన్న సోమీ రెడ్డి, కోటేశ్వర్ రెడ్డి, పవన్ కుమార్, కరుణాకర్, లోకనాథ్ రెడ్డి రెడ్డయ్య రెడ్డి , శ్రీనివాస్ చౌదరి , ప్రేమ్ కుమార్ రెడ్డి, షేక్ అబ్దుల్లా , కర్ణ గారు, పవన్ కుమార్ , హనుమంత్ రెడ్డి గారు, మహేశ్వర రెడ్డి, క్రాంతి కుమార్ రెడ్డి, గోపాల్ , రమణా రెడ్డి, చక్రి, షోయబ్ గార్లతోపాటు తో పాటు అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైయస్ఆర్ ఆశయాలు, సేవా విలువలు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించాలన్న సంకల్పంతో, ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తూ ముందుకు సాగుతామని మహమ్మద్ జిలాన్ భాష గారు, యు.ఎ.ఇ. వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్పష్టం చేశారు.