ఆందోళన వద్దు.. అండగా ఉంటాం

ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థులు వైయస్‌ జగన్ భ‌రోసా

వైయ‌స్ఆర్ జిల్లా: కడపలోని వైయ‌స్‌ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థులు వైయస్‌ జగన్‌ను కలిశారు. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (COA) అనుమతి లేకపోవడం, ADCET విడుదలపై వారం రోజులుగా స్టూడెంట్స్‌ ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఇడుపులపాయలో వైయస్‌‌ జగన్‌ను వాళ్లు కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. సమస్య పరిష్కారానికి తాను కృషి చేస్తానని వైయస్‌‌ జగన్‌ అన్నారు. ‘‘విద్యార్ధులకు మంచి యూనివర్సిటీ కడితే ఈ ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేస్తోంది. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్ధులకు అన్ని విధాల అండగా ఉంటుంది అని  వైయస్‌ జగన్ హామీ ఇచ్చారు. ఈ సమయంలో వైయ‌స్ఆర్‌సీపీ  విద్యార్థి, యువజన విభాగాల నేతలు విద్యార్థుల వెంట ఉన్నారు.

Back to Top