ఎన్నికల హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలం..   

ప్రభుత్వ వైఫల్యాలను తెలియచెప్పేందుకే రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో...
            
ప్రజల్లోకి కూటమి ప్రభుత్వ మోసాలను తీసుకెళ్లి ..ఎండగడదాం.. 
              
 వైయ‌స్ జగన్ ను తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు కార్యకర్తలు, నాయకులు  శాయశక్తులా కృషి చేయాలి...               
 
బాబు ష్యురిటీ.. మోసం గ్యారెంటీ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి 

అన్న‌మ‌య్య జిల్లా:  ఎన్నిక‌ల హామీల అమ‌లులో కూట‌మి ప్ర‌భుత్వం పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని  వైయ‌స్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం రామాపురంలోని మండల కన్వీనర్ గడికోట జనార్దన రెడ్డి అధ్యక్షతన జరిగిన రామాపురం మండల స్థాయి రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో సమీక్షా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శ్రీ‌కాంత్‌రెడ్డి,  హిందూపురం వైయ‌స్ఆర్ సిపి పరిశీలకులు  రమేష్ కుమార్ రెడ్డి పాల్గొని కార్య‌క‌ర్త‌ల‌కు, నాయ‌కుల‌కు దిశా నిర్దేశం చేశారు.  
                 
 ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకుండా ప్రజలను  చంద్రబాబు నయవంచన చేస్తున్నారని  మండిపడ్డారు. ఓట్లు వేయించుకుని అవసరం తీరాక హామీలను గాలికి వదిలేశారన్నారు. రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద పెట్టు బడి సాయం ఇంతవరకూ అందలేదన్నారు. బీసీ లకు 50 ఏళ్లకే పింఛన్ అందిస్తామని చెప్పి ఇవ్వకుం డా మోసం చేశారన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా, ఉద్యోగాలు కల్పించకుండా,నిరుద్యోగ భృతి చెల్లింకుండా యువతను దగా చేశారన్నారు. 18 ఏళ్లు నిండి 59 ఏళ్ల వయసు వరకు మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని ఏడాది దాటినా ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. విద్యుత్ బిల్లులను పెంచారన్నారు.    
                                
కూటమి మోసాలను వివరిద్దాం..    
                   వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  "రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో" (Recalling Chandrababu's Manifesto) పేరిట ఒక వినూత్న  ప్రచార కార్యక్రమాన్ని ప్రకటించారన్నారు. టీడీపీ నేతృత్వంలోని  కూటమి ప్రభుత్వం 2024 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు, సూపర్ సిక్స్ పథకాల అమలు విఫలమైందని ప్రజలకు తెలియజేయడమే ఈ కార్యక్రమ లక్ష్యమన్నారు. కూటమి ప్రభుత్వ పధ్నాలుగు నెలల  పాలనలో ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని, మోసాన్ని వివరించాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్ శ్రీకారం చుట్టిన బాబు ష్యూరిటీ- మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని గ్రామ నాయకులు,కార్యకర్తలతో  కలిసి మండల నాయకులు  ప్రచారం చేయాలన్నారు. చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజలకు గుర్తుచేస్తూ ఈ బృహత్తర కార్యక్రమం పై  గ్రామాలలో సమావేశాలు నిర్వహించి కార్యక్రమాన్ని అందరికీ తెలియ జేయాలన్నారు.గ్రామ గ్రామానికి వెళ్లి అక్కడి స్థానిక నాయకులు,కార్యకర్తలు కలిసి  ప్రచారం చేయాలని,ఆ గ్రామం లో రచ్చబండ ఏర్పాటు చేసి కూటమి పాలన వైఫల్యాలను వివరించాలన్నారు.ఈ కార్యక్రమాన్ని పూర్తి క్రమశిక్షణతో  నిర్వహించి రామాపురం మండలాన్ని ఆదర్శంగా నిలపాలన్నారు. ప్రజల్లో చైతన్యం నింపి, టి డి పి మోసాలపై స్పష్టత నిస్తూ,జగన్ పాలనలో అమలైన సంక్షేమ పథకాలను వివరించి గత జగన్ పాలనకు, నేటి కూటమి ప్రభుత్వానికి గల వ్యత్యాసాలను వివరించాలన్నారు.   

QR కోడ్ స్కాన్ విధానాన్ని ఉపయోగించాలి...
        ప్రజలకు చేరువయ్యేందుకు  ఈ కార్యక్రమంలో QR కోడ్ స్కాన్ విధానాన్ని ఉపయోగించాలని, ఈ QR కోడ్‌ను స్కాన్ చేసి, ఒక బటన్ నొక్కితే చంద్రబాబు నాయడు మేనిఫెస్టో వివరాలు, మరో బటన్ నొక్కితే కూటమి వాగ్దానాలు నెరవేరకపోవడం వల్ల ఒక్కో కుటుంబం ఎంత నష్టపోయిందో లెక్కలు, వివరాలు చూపిస్తాయని శ్రీకాంత్ రెడ్డి  వివరించారు.  

ప్రజా సమస్యలపై వైయ‌స్ జగన్ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తుంటే ప్రభుత్వానికి భయం పెరుగుతోంది...               
           ప్రజా సమస్యలపై జగన్ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తుంటే ప్రభుత్వానికి భయం పెరుగుతోందన్నారు. గుంటూరులో మిర్చి రైతుల సమస్యలపైన,పొదిలో పొగాకు రైతుల సమస్యలపైన, బంగారుపాళ్యం లో మామిడి రైతుల సమస్యల పరిష్కారంపై  ప్రభుత్వం పై జగన్ ఒత్తిడి  చేశారన్నారు.జగన్ ఒత్తిడి చేస్తుంటేనే ప్రభుత్వ పెద్దలు సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లుచున్నారన్నారు. జగన్ బంగారు పాళ్యం పర్యటనలో ఎస్ పి స్థాయి అధికారులే తాళ్ళు పట్టుకుని రైతులను రానీయకుండా అడ్డుకున్నారని, కానీ రైతులు ఆ ఆంక్షలును  అభిమానంతో దాటుకుంటూ జగన్ దగ్గరకు వచ్చి తమ సమస్యలను చెప్పుకున్నారన్నారు. 

  రాయచోటి అభివృద్ధికి ఎంతో కృషి చేశా... 
               రాయచోటిని జిల్లా కేంద్రం చేయడంతో పాటు నియోజక వర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేయడం జరిగిందన్నారు. తమ హయాంలో వెలిగల్లు నీటిని రామాపురం మండలంలో హసనాపురం గ్రామం లోని చెరువుల వరకు నీటిని అందించామన్నారు. కాలేటివాగు ప్రాజెక్ట్ పనులు నలభై శాతం పూర్తయ్యాయన్నారు. అర్హులందరికీ పక్కా గృహాలను అందివ్వడం జరిగిందన్నారు. 

కార్యకర్తలకు,నాయకులకు ఏ ఇబ్బంది జరిగినా తోడుగా నిలుస్తా...  
             వైయ‌స్ఆర్ సీపీ కార్యకర్తలకు, నాయకులకు ఏ ఇబ్బంది జరిగినా తోడుగా నిలుస్తానన్నారు. ఏ గ్రామమంలోనైనా  మన పార్టీ వారు ఇబ్బందిపడితే మనమందరం ఏకమై, పిడికిలి బిగించి , అధికార పార్టీ అన్యాయాలు,అక్రమాలను తిప్పిగొట్టాలన్నారు. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు.అందరమూ కలసి కట్టుగా,తోడుగా,ఒక కుటుంభంలా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుందామన్నారు.

హామీలను మరచే చరిత్ర చంద్రబాబుది: హిందూపురం పరిశీలకు రెడ్డెప్పగారి రమేష్ కుమార్ రెడ్డి   
             హామీలను మరచే చరిత్ర చంద్రబాబుకు ఉందని వైఎస్ఆర్ సిపి హిందూపురం పార్లమెంట్ పరిశీలకులు రెడ్డెప్పగారి రమేష్ రెడ్డి అన్నారు.వైఎస్ఆర్ సిపి పోరాటాలతోనే కూటమి ప్రభుత్వం తల్లికి వందనం ను అమలు చేసిందన్నారు.  జగన్ హయాంలో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అయ్యాయని, ప్రభుత్వ పాఠశాలలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. గత ఐదేళ్లలో అప్పటి ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి రాయచోటిని ఎంతో అభివృద్ధి చేశారన్నారు. చంద్రబాబుకు ప్రచార యావ ఎక్కువన్నారు.    కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలన్నారు.
             జెడ్ పి టి సి మాసన వెంకట రమణ, మాజీ ఎంపిపి ప్రభాకర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కర్ణపు విశ్వనాధ రెడ్డి,  సింగిల్ విండో మాజీ అధ్యక్షులు పెద్దిరెడ్డి,ఆదినారాయణ రెడ్డి,  వైస్ ఎంపిపి బాబు, సర్పంచ్ లు అయోధ్యాపురం నాగభూషన్ రెడ్డి, వెంకట రెడ్డి,ఆయూబ్,ముంగర సుబ్బయ్య, ఆంజనేయులు, రఘు, రామాంజులు,                  సూరం వెంకట సుబ్బారెడ్డి, మాజీ వైస్ ఎంపిపి మురళీధర్ రెడ్డి, మాజీ సర్పంచ్ లు మురళీ మోహన్ రెడ్డి ,  రాజారెడ్డి,విశ్రాంత లెక్షరర్ ఈశ్వర్ రెడ్డి, వడ్డెర కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ఆంజనేయులు,హుసేన్,నక్కా నారాయణ తదితరులు పాల్గొన్నారు.
 

Back to Top