టీడీపీ ఎమ్మెల్యే గాలిపై మహిళ కమిషన్‌కు మాజీమంత్రి రోజా ఫిర్యాదు

ఎమ్మెల్యే వ్యాఖ్య‌ల‌ను జాతీయ, రాష్ట్ర‌ మహిళ కమిషన్ల దృష్టికి తీసుకెళ్లిన‌ మాజీమంత్రి రోజా
 
మహిళల వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డ టీడీపీ ఎమ్మెల్యే గాలి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్

చిత్తూరు: పత్రికలో రాయడానికి వీలు లేనంతగా బూతులు తిడుతూ మాజీ మంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి ఆర్కే రోజా వ్యక్తిత్వ హననానికి టీడీపీ ఎమ్మె­ల్యే గాలి భాను ప్రకాష్‌ పాల్పడ్డారు. మహిళా లోకం అసహ్యించుకునేలా సోషల్‌ మీడియాలో ఆమెపై అసభ్యకర వ్యాఖ్యలను ట్రోల్‌ చేశారు. ఈ వ్యవహారంపై ఆర్‌కే రోజా  జాతీయ మ‌హిళా క‌మిష‌న్‌, రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ల‌కు ఫిర్యాదు చేశారు. సభ్య సమాజం సిగ్గుపడేలా తనపై ట్రోల్‌ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. 

నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, ఆయన సహచరులు సోషల్‌ మీడియాలో తన గురించి ‘‘రూ.2,000 ఇస్తే ఏ పనైనా చేసేది. మార్కెట్లో ఆ మాట ఉంది. ఆమె నేడు రూ.రెండు వేల కోట్లు సంపాదించింది. ఆమె వ్యాంప్‌కు ఎక్కువ.. హీరోయిన్‌కు తక్కువ. ఈ పిచ్చి దాంతో వాళ్ల పార్టీ నేతకు పిచ్చెక్కిందా.. ఆయన పిచ్చి ఈమెకెక్కిందా తెలియడం లేదు’’ అని దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎవరైనా ఇంత నీచంగా మాట్లాడుతారా? అని ఆమె ప్రశ్నించారు. వ్యక్తిత్వ హననం చేసేలా మాట్లాడిన నగరి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరారు. తాను  రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై గొంతెత్తినందుకు టీడీపీ ఎమ్మెల్యే గాలిభాను..  అసభ్యకరంగా, దుర్భాషలాడుతూ బాధ పెట్టార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇది త‌నకు మాత్రమే జరిగిన అవమానం కాదు. అధికారంలో ఉన్న వారిని ప్రశ్నించడానికి ధైర్యం చేసే ప్రతి మహిళపై జరిగిన దాడిగా ఆమె అభివ‌ర్ణించారు. ఇలాంటి రాష్ట్రంలోనా మనం నివసిస్తుంది? ఇది ప్రమాదకరమైన సంస్కృతి అంటూ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.  కూట‌మి నేత‌లు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నార‌ని, టీడీపీ ఎమ్మెల్యే భాను ప్రకాష్‌పై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాల‌ని ఆమె డిమాండ్‌ చేశారు.  

స్పందించ‌ని పోలీసులు
కాగా, ఇదే విష‌యంపై నిన్న న‌గ‌రి పోలీసుల‌కు మాజీ మంత్రి ఆర్కే రోజా  ఫిర్యాదు చేసినా ఇంత‌వ‌ర‌కు స్పందించక పోవడంపై ప‌లు విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. రోజాపై టీడీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్య‌ల‌ను వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు ముక్త‌కంఠంతో ఖండిస్తున్నారు. మ‌హిళాలోకం అధికార పార్టీ నేత‌ల‌తీరుపై మండిప‌డుతున్నారు. 
మహిళలను అవమాన పరచడం, కించ పరచడం అధికార టీడీపీ నేతల­కు పరిపాటిగా మారింది. ఇంట్లో మహిళలు ఏమనుకుంటారోనన్న కనీస స్పృహ లేకుండా ప్రతిపక్ష వైయ‌స్ఆర్‌సీపీ మహిళా నేతలపై నిస్సిగ్గుగా నోరు పారేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న కృష్ణా జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారికను అసభ్యంగా దూషిస్తూ.. ఆమె వాహనంపై టీడీపీ సైకో మూకలు దాడి చేసిన ఘటనపై రాష్ట్రం అట్టుడుకుతుండగా.. మరో వైపు మాజీ మంత్రి ఆర్కే రోజా­పై సభ్య సమాజం సిగ్గు పడేలా దుర్భాషలాడు­తూ ఐ టీడీపీ, చిత్తూరు జిల్లా నగరి టీడీపీ ఎమ్మె­ల్యే గాలి భాను ప్రకాష్‌ రెచ్చిపోయారంటూ ప‌లువురు మ‌హిళ‌లు సోష‌ల్ మీడియా వేదిక‌గా కామెంట్స్ చేస్తున్నారు. ఎక్స్ వేదిక‌గా రోజాపై జ‌రిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ పోస్టులు పెడుతున్నారు. 

Back to Top