తూర్పు గోదావరి: అనపర్తి నియోజకవర్గం దుప్పలపూడి గ్రామంలో దళిత మహిళపై దాడి చేసిన అధికార పార్టీకి చెందిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని, హత్యాయత్నం కేసు నమోదు చేయాలని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయేలు డిమాండ్ చేశారు. శుక్రవారం అనపర్తి నియోజకవర్గంలో వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇజ్రాయేలు మాట్లాడుతూ.. “ఈ దాడిని తక్షణమే హత్యాయత్నంగా పరిగణించి కేసు నమోదు చేయాలి. లేకపోతే ఎమ్మెల్యే ఇంటి ముందు తాము తీవ్ర నిరసన చేపడతాం. ఈ విషయాన్ని రాష్ట్ర హోంమంత్రి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళతాం. దళితులపై దాడులను ప్రోత్సహిస్తున్న అధికార రౌడీలకు రాజకీయ ఆశ్రయం ఇచ్చిన ఎమ్మెల్యేను ప్రశ్నించక తప్పదు. ఈ ఘటనపై తక్షణమే కేసులు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేయకపోతే వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా పోరాటానికి సిద్ధమవుతుందని డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి హెచ్చరించారు. మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ... “ఇటీవలే పెట్రోల్ బంక్ లో దళిత మహిళపై దాడి జరిగిన ఘటన మరువకముందే... ఇప్పుడు మళ్లీ దుప్పలపూడిలో ఇదే తరహా ఘటన జరగడం ప్రభుత్వ యంత్రాంగ వైఫల్యానికి నిదర్శనం. దళిత మహిళపై, యువకులపై దాడి చేసిన నల్లమిల్లి వెంకటరెడ్డి (ఎన్.వి), అతని అనుచరులు ప్రస్తుతం అనపర్తి ఎమ్మెల్యే సొల్లు రామకృష్ణారెడ్డి ఇంటిలో ఆశ్రయం పొందుతున్నట్లు తెలుస్తోంది. “రౌడీలకు కొమ్ముకాస్తున్న రౌడీ ఎమ్మెల్యే” అంటూ తీవ్ర విమర్శలు చేశారు. బాధితుడు బుంగ వీరబాబు మాట్లాడుతూ, “మీరు మా అందరి ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచారు అన్న విషయాన్ని మరవకండి. కానీ మేము గతంలో టీడీపీకి పనిచేశామని, అయ్యిన మా మీద వేధింపులు చేస్తున్నారు. మమ్మల్ని ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు?” అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.