కృష్ణా జిల్లా: బీసీ మహిళ హారికను చంపాలని చూశారని వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. హారికను చంపడానికి వచ్చినవారికి పోలీసులు సహకరించారన్నారు. పచ్చగూండాలకు పోలీసులు సపోర్ట్ చేశారు. హారికపై దాడి చేసిన పచ్చ సైకోలపై చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో నారా సైకో పాలన కొనసాగుతోంది’’ అంటూ పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్గాని భరత్ రామ్ పోలీసుల సమక్షంలోనే కృష్ణా జిల్లా జెడ్పీ ఛైర్‌పర్సన్ ఉప్పాల హారిక గారిపై దాడి జరగడం చూస్తుంటే ప్రజాక్షేత్రంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోంది. గత సంవత్సర కాలంగా రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైయస్సార్ సీపీ నాయకులపై అనేక దాడులు జరిగాయి -