ప్రత్తిపాడులో వెన్నుపోటుకు రెండేళ్లు.. పోస్టర్ ఆవిష్కర‌ణ‌

 గుంటూరు : చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఎన్నికల హామీల అమలులో విఫలమైందని నిరసిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో  ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పోస్టర్‌ను బుధవారం ఆవిష్కరించారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని గుంటూరు రూరల్ మండలం ఏటుకూరు బైపాస్ రోడ్డులో ఉన్న వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త  బలసాని కిరణ్ కుమార్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా బలసాని కిరణ్ కుమార్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన అనేక హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. ప్రజలను మోసం చేసిన ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

రేపు ప్రతి మండల కేంద్రంలో భారీ స్థాయిలో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలు, అమలుకాని హామీలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ఈ కార్యక్రమాల లక్ష్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. 

Back to Top