ఎస్‌ఐఆర్ కార్యక్రమంపై బూత్ లెవల్ ఏజెంట్లకు అవగాహన సదస్సు

 గోపాలపురం: గోపాలపురం మండలంలోని గోపాలపురం గ్రామంలో ఉన్న ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఎస్‌ఐఆర్ (SIR) కార్యక్రమానికి సంబంధించి బూత్ లెవల్ ఏజెంట్ల అవగాహన సదస్సు నిర్వహించారు.  ఈ సమావేశానికి రాష్ట్ర మాజీ హోంమంత్రి, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, గోపాలపురం నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీమతి తానేటి వనిత అధ్యక్షత వహించారు. బూత్ స్థాయిలో పార్టీ బలోపేతం, ఓటరు జాబితాల పరిశీలన, ఎస్‌ఐఆర్ కార్యక్రమం లక్ష్యాలు, కార్యాచరణపై నాయకులు, బీఎల్‌ఏలకు దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వెలగా శ్రీరామమూర్తి, నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షుడు ఆచంట సురేష్, రాష్ట్ర ప్రచార కమిటీ ఉపాధ్యక్షుడు కూసం మోహన్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీ రాజ్ విభాగ ఉపాధ్యక్షుడు పిన్నమనేని చినబాబు, గ్రామ కమిటీ అధ్యక్షుడు ముల్లంగి శ్యామ్, వైయ‌స్ఆర్‌సీపీ సీనియర్ నాయకుడు ముల్లంగి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ తోట నాగేశ్వరరావు, మండల ఉపాధ్యక్షుడు గేల్ల శ్రీను, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆన్సర్ భాష, మండల బూత్ కమిటీ అధ్యక్షుడు ఎస్‌కే మస్తాన్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సాలి వేణు తదితరులు పాల్గొన్నారు. 

Back to Top