రామచంద్రపురంలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పోస్టర్ ఆవిష్కరణ

 
 రామచంద్రపురం:
తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిందని ఆరోపిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో  "వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్‌ను ఆవిష్కరించారు.

రామచంద్రపురం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రామచంద్రపురం నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జి  పిల్లి సూర్యప్రకాశ్  పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలు, అమలుకాని హామీలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేపట్టనున్న నిరసన కార్యక్రమాలపై చర్చించారు.

ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని, సంక్షేమ పథకాల అమలులో అనేక లోపాలు ఉన్నాయని నాయకులు పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తూ వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్యక్రమాలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీలు అంబటి భవాని, పంపన నాగమణి సుబ్బారావు, మండల మరియు పట్టణ కన్వీనర్లు పోలినాటి వరప్రసాద్, గాదంశెట్టి శ్రీధర్, జిల్లా అధికార ప్రతినిధి పెమ్మిరెడ్డి మురళి, నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షుడు చిల్లి నాగేశ్వరరావు, నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు యల్లమిల్లి సతీష్ కుమారి, పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు మల్లిడి సాయి లక్ష్మి, మాజీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
 

Back to Top