రాష్ట్ర‌వ్యాప్తంగా నిర‌స‌న‌ల హోరు

“చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు”

175 నియోజకవర్గాల్లో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో భారీ ప్రదర్శనలు 

న‌ల్ల బెలూన్స్ ఎగుర‌వేత‌..టీడీపీ మేనిఫోస్టో, దిష్టిబొమ్మ‌ల ద‌హ‌నం  

తాడేపల్లి : “చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” పేరుతో వైయ‌స్ఆర్‌సీపీ చేపట్టిన రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ అంతటా హోరెత్తించాయి.  రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలు, ఆందోళనలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణులు ప్రభుత్వ విధానాలపై నిరసన గళం వినిపించాయి. పలుచోట్ల పోలీసుల ఆంక్షలు, అడ్డంకులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. మహిళలు, రైతులు, నిరుద్యోగ యువత, డీఎస్సీ బాధితులు స్వచ్ఛందంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొని ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ర్యాలీల్లో ఇంధన ధరల పెరుగుదల, నిత్యావసర వస్తువుల ధరల భారం, డీఎస్సీ-2025లో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలు, నిరుద్యోగ సమస్యలు తదితర అంశాలపై ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందంటూ నిరసనకారులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు మాట్లాడుతూ, రెండేళ్ల పాలనలో ప్రజల ఆశలను ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందని విమర్శించారు. మహిళలు, రైతులు, విద్యార్థులు, యువత సహా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ నిరసన కార్యక్రమాలు ప్రజల నుంచి విశేష స్పందన పొందాయని, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై జనాగ్రహం కట్టలు తెంచుకుంటోందని వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తమ పోరాటం మరింత ఉధృతంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.

- తిరుపతి  
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో భారీ నిరసన ర్యాలీలు నిర్వహించారు. “చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” అనే నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.  తిరుపతి మరియు చిత్తూరు జిల్లాల్లో వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, యువనేత భూమన అభినయ్‌రెడ్డి నేతృత్వంలో భారీ నిరసన ర్యాలీ జరిగింది. తిరుపతి నగరంలోని గ్రూప్ థియేటర్ సర్కిల్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ తుడా వైయ‌స్ఆర్‌ సర్కిల్ వరకు కొనసాగింది. వేలాదిగా తరలివచ్చిన వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేశారని, ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన సంక్షేమ హామీలను విస్మరించడం ద్వారా అక్కచెల్లెమ్మలకు వెన్నుపోటు పొడిచారని నాయకులు విమర్శించారు. 

- పులివెందులలో వైయ‌స్ఆర్‌సీపీ భారీ ఆందోళన 
“వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో వైయ‌స్ఆర్‌ జిల్లాలోని పులివెందులలో భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి పులివెందులలోని వైయస్ జయమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి భారీ ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీలో పాల్గొన్న వేలాది మంది పార్టీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, ప్రజలను మోసం చేస్తూ పాలన సాగిస్తోందని నాయకులు విమర్శించారు. ఈ సందర్భంగా వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా “వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైయ‌స్ఆర్‌సీపీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. పులివెందులలో నిర్వహించిన ఈ ఆందోళన కార్యక్రమం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.

- నగిరిలో భారీ నిరసన..  
“వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా నగిరిలో మాజీ మంత్రి రోజా ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నగిరి పట్టణంలో నిర్వహించిన బైక్ ర్యాలీకి రోజా నాయకత్వం వహించారు. ర్యాలీ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పార్టీ శ్రేణులు తమ నిరసనను వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి రోజా మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన “సూపర్ సిక్స్” హామీలను చంద్రబాబు నాయుడు గాలికొదిలేశారని ఆరోపించారు. మహిళలకు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో అక్కచెల్లెమ్మలకు వెన్నుపోటు పొడిచినట్లయ్యిందని ఆమె వ్యాఖ్యానించారు. వైయస్ జగన్ పాలనతో పోలిస్తే కూటమి ప్రభుత్వం 10 శాతం స్థాయిలో కూడా పాలన అందించలేకపోయిందని విమర్శించారు. “కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా వైయస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చింది. కానీ ప్రస్తుతం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది” అని రోజా అన్నారు. అలాగే సుగాలి ప్రీతి కేసు అంశాన్ని ప్రస్తావిస్తూ, బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పిన వారు ఇప్పటి వరకు ఆ హామీని నిలబెట్టుకోలేదని ఆరోపించారు. ప్రజల సమస్యలను పక్కనబెట్టి ప్రచార రాజకీయాలు చేస్తున్నారని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. 

- కుప్పంలో నిర‌స‌నాగ్ర‌హం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూ పాలన సాగిస్తోందని ఎమ్మెల్సీ భరత్ విమర్శించారు. కుప్పంలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన ర్యాలీలో భారీ ఎత్తున ప్ర‌జ‌లు పాల్గొని కూట‌మి పాల‌న‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  ఇది ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకతకు నిదర్శనమని భ‌ర‌త్ పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఇప్పటి వరకు నెరవేర్చలేదని ఆరోపించారు. వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు నమోదు చేసి జైళ్లకు పంపిస్తున్నారని ఎమ్మెల్సీ భరత్ విమర్శించారు. ప్రతిపక్ష గొంతును అణచివేసేందుకు అధికార యంత్రాంగాన్ని వినియోగిస్తున్నారని ఆరోపించారు. కుప్పంలో జరుగుతున్న అవినీతిపై వచ్చిన నివేదికల కారణంగానే పార్టీ ఇన్‌చార్జిని మార్చాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. అభివృద్ధి పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.  


- విజయవాడ పశ్చిమలో వైయ‌స్ఆర్‌సీపీ నిరసన 
“వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ చేపట్టిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ కార్పొరేటర్లు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వారు విమర్శించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రెండు సంవత్సరాల పాలనలో ప్రజలకు మేలు చేయాల్సిన ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను నిరాశపరిచిందన్నారు. మహిళలు, యువత, రైతులు, విద్యార్థులు సహా ప్రతి వర్గానికి ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ నిర్వహించిన ఈ నిరసనలో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలు చేశారు. ప్రజా సమస్యలపై పార్టీ పోరాటం నిరంతరం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.

- విజయవాడ తూర్పులో వైయ‌స్ఆర్‌సీపీ నిరసన ర్యాలీ 
“వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. ఎమ్ హోటల్‌ వద్ద ప్రారంభమైన నిరసన ర్యాలీ నగరంలోని ప్రధాన మార్గాల గుండా బస్టాండ్ వరకు కొనసాగింది. ర్యాలీలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, పార్టీ స్టేట్ సోషల్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడు అంజిరెడ్డి పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ, ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు. 

- విజయవాడ సెంట్రల్‌లో వైయ‌స్ఆర్‌సీపీ నిరసన ర్యాలీ 
“వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. గాయత్రి కన్వెన్షన్‌ నుంచి ప్రారంభమైన ఈ నిరసన ర్యాలీ బీఆర్‌టీఎస్ రోడ్డు మీదుగా సత్యనారాయణపురంలోని శివాజీ కేర్ సెంటర్ వరకు కొనసాగింది. ర్యాలీలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను నిరాశపరిచిందని విమర్శించారు. ముఖ్యంగా మహిళలు, యువత, రైతులు, విద్యార్థులకు చేసిన వాగ్దానాలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. 

- దెందులూరులో భారీ బైక్ ర్యాలీ 
ఏలూరు జిల్లా, దెందులూరు నియోజకవర్గంలోని కొండలరావుపాలెం గ్రామంలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పార్టీ శ్రేణులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది. 
ఈ సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ నాయకుడు అబ్బయ్య చౌదరి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ ప్రారంభమైంది. పార్టీ జెండాలు చేతబట్టి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలతో ప్రాంతాన్ని హోరెత్తించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ, ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలను ఎండగడుతూ ఈ ర్యాలీ నిర్వహించినట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ ఐక్యతను చాటిచెప్పారు. 

- పల్నాడు జిల్లా :
“చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో పాల్గొనేందుకు అమరావతికి వెళ్తున్న వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఆరోపించారు.
మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఆధ్వర్యంలో అమరావతిలో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమానికి పెద్దకూరపాడు నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్తున్నారు. అయితే మార్గమధ్యంలో పలుచోట్ల పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ వారిని నిలువరిస్తున్నట్లు పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి. బయ్యవరం అడ్డరోడ్డు, కోనూరు అడ్డరోడ్డు ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక పహారా ఏర్పాటు చేసి, అమరావతికి వెళ్తున్న వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తల వివరాలను నమోదు చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న వారి పేర్లను రాసుకుంటూ అనవసర ఆంక్షలు విధిస్తున్నారని పార్టీ నాయకులు విమర్శించారు. ఈ సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు మాట్లాడుతూ, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు కూడా ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. పోలీసుల నిర్బంధాలు, ఆంక్షలు ఎంత విధించినా ప్రజా సమస్యలపై తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. 

- గుడివాడలో భారీ నిరసన ర్యాలీ 
“చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా గుడివాడలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఏలూరు రోడ్డు నుంచి మార్కెట్ సెంటర్ వరకు చేపట్టిన ఈ ర్యాలీలో మాజీ మంత్రి కొడాలి నాని, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రెండేళ్ల అనంతరం బహిరంగ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కొడాలి నాని, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “సంపద సృష్టిస్తానని చెప్పి లక్షల కోట్ల రూపాయల అప్పులు చేస్తున్నారు. మాది గొడ్డలి పార్టీ అని చంద్రబాబు, లోకేష్, కూటమి నాయకులు పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారు. వాస్తవానికి పచ్చ గొడ్డలి టీడీపీదే. ఆ పార్టీ చరిత్ర అంతా వెన్నుపోట్లతో నిండి ఉంది” అని విమర్శించారు. “శివుడు, దుర్గాదేవి, వినాయకుడు వంటి దేవతల చేతుల్లో కూడా గొడ్డలి ఉంటుంది. 2029లో ప్రజలు పరశురాముడి గొడ్డలిని వైయస్ జగన్ చేతికి అందిస్తారు. పరశురాముడిలా జగన్ టీడీపీకి రాజకీయ సమాధి కడతారు. అవినీతిలో కూరుకుపోయిన టీడీపీ నాయకులు జగన్ చేతిలో ఉన్న గొడ్డలిని చూసి భయపడుతున్నారు” అని కొడాలి నాని వ్యాఖ్యానించారు. 

- చీపురుపల్లిలో నల్ల బెలూన్లు ఎగరవేత‌
చీపురుపల్లిలో నిరసన కార్యక్రమంలో భాగంగా నల్ల బెలూన్లు ఎగరవేయడానికి ప్రయత్నించిన వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. నల్ల బెలూన్ల ద్వారా ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేయాలని పార్టీ శ్రేణులు సిద్ధమైన సమయంలో పోలీసులు జోక్యం చేసుకుని వాటిని ఎగరవేయనీయకుండా నిలువరించినట్లు సమాచారం. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు తమ నిరసనను తెలియజేసేందుకు శాంతియుతంగా కార్యక్రమం నిర్వహించేందుకు వచ్చినప్పటికీ పోలీసులు అనుమతి లేదంటూ అడ్డుకున్నారని ఆరోపించారు. నల్ల బెలూన్లను స్వాధీనం చేసుకుని వారిని అక్కడి నుంచి వెనక్కి పంపించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 
పోలీసుల చర్యపై వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కూడా ప్రభుత్వం హరిస్తోందని విమర్శించారు. అయితే ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా పోలీసులు పరిస్థితిని అదుపులో ఉంచినట్లు తెలుస్తోంది. 

- బొబ్బిలిలో ర్యాలీకి పోలీసుల అడ్డంకులు 
విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “వెన్నుపోటుకు రెండేళ్లు” నిరసన ర్యాలీకి పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారని పార్టీ నాయకులు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ చేపట్టిన ఈ ర్యాలీలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయితే ర్యాలీ కొనసాగుతున్న సమయంలో పోలీసులు జోక్యం చేసుకుని ముందుకు సాగకుండా అడ్డుకున్నట్లు పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు మాట్లాడుతూ, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు కూడా అనవసర ఆంక్షలు విధించడం సరికాదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే తమ లక్ష్యమని, పోలీసుల అడ్డంకులు ఎంత ఉన్నా ప్రజా సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. 

- అనంతపురంలో భారీ నిరసన ర్యాలీ 
చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతపురంలోని లలిత కళా పరిషత్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ నగర ప్రధాన వీధుల గుండా టవర్ క్లాక్ వరకు కొనసాగింది. ర్యాలీలో పాల్గొన్న వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, ప్రజా సంక్షేమం కంటే రాజకీయ ప్రయోజనాలకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు. ప్రజల సమస్యలపై వైయ‌స్ఆర్‌సీపీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

- పోలీసుల తీరుపై కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం..  
తాడిపత్రిలో నిరసన ప్రదర్శన నిర్వహించకుండా అడ్డుకున్న పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అనంతపురం ఎస్పీ కార్యాలయం ఎదుట ఆయన ధర్నాకు దిగారు.
తాడిపత్రిలో నిర్వహించాలనుకున్న నిరసన కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించడం, కార్యకర్తలను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.  కేతిరెడ్డి పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడుతూ పోలీసుల వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కూడా కాలరాస్తున్నారని ఆయన ఆరోపించారు. తాడిపత్రిలో శాంతియుతంగా నిరసన చేపట్టాలని భావించినప్పటికీ పోలీసులు అడ్డుకున్నారని పేర్కొన్నారు. అలాగే, పోలీసులు నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన బాధ్యతను విస్మరించి టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుల మాదిరిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా చట్టం ప్రకారం పనిచేయాలని పోలీసు అధికారులకు సూచించారు. ఎస్పీ కార్యాలయం ఎదుట కొంతసేపు కొనసాగిన ఈ ధర్నా సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు ప్రభుత్వానికి, పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలని, ప్రతిపక్షాల గొంతు నొక్కే చర్యలను నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు.

- నెల్లూరులో భారీ ర్యాలీ 
“వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరంలోని వీఆర్‌సీ సెంటర్ వద్ద వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. నెల్లూరు సిటీ ఇన్‌చార్జ్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో వీఆర్‌సీ సెంటర్ నుంచి గాంధీ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 
ఈ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, అన్ని వర్గాల ప్రజలను నిరాశపరిచిందని నాయకులు విమర్శించారు. నిరసన కార్యక్రమం నేపథ్యంలో నెల్లూరు నగరంలో పోలీసులు భారీగా మోహరించారు. ర్యాలీ, ఆందోళన కార్యక్రమాలను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు ఆరోపించారు. అయినప్పటికీ ప్రజాస్వామ్యబద్ధంగా తమ నిరసనను కొనసాగిస్తామని పార్టీ శ్రేణులు స్పష్టం చేశాయి.
వీఆర్‌సీ సెంటర్ నుంచి గాంధీ సెంటర్ వరకు సాగిన ఈ ర్యాలీతో నెల్లూరు నగరంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రజా సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందని వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు వెల్లడించారు.

పార్వ‌తీపురంలో నిరసన ర్యాలీకి పోటెత్తిన ప్రజలు 
“వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం నియోజకవర్గంలో నిర్వహిస్తున్న భారీ నిరసన ర్యాలీకి వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు, అభిమానులు, సామాన్య ప్రజలు భారీగా తరలివచ్చారు. మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సారథ్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి తండోపతండాలుగా ప్రజలు చేరుకున్నారు. ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు స్వయంగా ఆహ్వానిస్తూ, పేరు పేరునా పలకరిస్తూ స్వాగతం పలికారు. అనంతరం వారిని నిరసన ర్యాలీ కార్యక్రమం వద్దకు పంపించారు. 

- నంద్యాల‌లో ఎద్దుల బండ్లు, గాడిదలతో వినూత్న నిరసన 
కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన వెన్నుపోటును నిరసిస్తూ నంద్యాలలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. “వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఈ ఆందోళనలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నంద్యాలలోని వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయం నుంచి శ్రీనివాస్ సెంటర్ వరకు సాగిన ర్యాలీలో ఎద్దుల బండ్లు, గాడిదలను వినూత్న నిరసన రూపంగా వినియోగించారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందంటూ నాయకులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. ర్యాలీలో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. 

-  మచిలీపట్నంలో భారీ ర్యాలీ 
“చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా కృష్ణాజిల్లా మచిలీపట్నం నియోజకవర్గంలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు వందలాదిగా పాల్గొన్నారు. మచిలీపట్నం నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త పేర్ని కిట్టు నాయకత్వంలో లక్ష్మీ టాకీస్ సెంటర్ నుంచి జిల్లా కోర్టు వద్ద ఉన్న వైయస్సార్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం పేర్ని కిట్టు ర్యాలీని ప్రారంభించారు. “వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా పార్టీ శ్రేణులు నల్ల బెలూన్లను ఎగురవేసి తమ నిరసనను వినూత్నంగా తెలియజేశారు. ర్యాలీ మొత్తం నినాదాలతో హోరెత్తగా, పెద్ద సంఖ్యలో పాల్గొన్న కార్యకర్తలు ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

- మాడుగులలో నిరసన కార్యక్రమం  
“చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు” పేరుతో వైయ‌స్ఆర్‌సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమం అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారీ స్పందన లభించింది. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, వైయ‌స్ఆర్‌సీపీ నాయకురాలు ఈర్లే అనురాధ పాల్గొన్నారు. కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మాడుగుల నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు భారీగా పాల్గొని తమ ఐక్యతను చాటిచెప్పాయి.  

- విశాఖ సౌత్‌లో ఉద్రిక్తత.. 
“చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా విశాఖ సౌత్ నియోజకవర్గంలో వైయ‌స్ఆర్‌సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న నిరసనను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు నిలువరించడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కొంతసేపటికి తోపులాటకు దారితీయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కూడా హరిస్తున్నారని ఆయన ఆరోపించారు. శాంతియుతంగా నిరసన కార్యక్రమం నిర్వహించేందుకు వచ్చిన పార్టీ శ్రేణులను అడ్డుకోవడం అన్యాయమని విమర్శించారు. 

- విశాఖ నార్త్‌లో పోలీసుల ఓవ‌రాక్ష‌న్‌
“చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమం సందర్భంగా విశాఖ నార్త్ నియోజకవర్గంలో పోలీసులు ఓవ‌రాక్ష‌న్ చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంపై జిల్లా పార్టీ అధ్యక్షుడు కేకే రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమానికి తరలివస్తున్న పార్టీ కార్యకర్తలను పోలీసులు నిలువరించడంతో కేకే రాజు పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టించడం సరికాదని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తూ కేకే రాజు పోలీసుల తీరును తప్పుబట్టారు. అనంతరం పోలీసుల వైఖరిని నిరసిస్తూ రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఆయనకు మద్దతుగా వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు కూడా నిరసనలో పాల్గొన్నారు. మీడియాతో మాట్లాడుతూ కేకే రాజు, పోలీసులు నిష్పాక్షికంగా వ్యవహరించకుండా ప్రభుత్వానికి తొత్తుల్లా పనిచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా వైయ‌స్ఆర్‌సీపీకి పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి నిరసన కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని విమర్శించారు. కొంతసేపు కొనసాగిన ఆందోళనతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అనంతరం పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో ఉద్రిక్తత తగ్గింది. ఈ ఘటన విశాఖ నార్త్ నియోజకవర్గంలో రాజకీయ చర్చకు దారితీసింది.

- గాజువాకలో టీడీపీ మేనిఫెస్టో, డీఎస్సీ భూతం దగ్ధం 
“చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా గాజువాక నియోజకవర్గంలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేలాదిమంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
సుమారు ఐదు వేల మందితో నిర్వహించిన ఈ ర్యాలీలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో విఫలమయ్యారంటూ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ప్రతులను, బాండ్ పేపర్లను, అలాగే డీఎస్సీ సమస్యలను ప్రతిబింబించే “డీఎస్సీ భూతం” ప్రతిరూపాన్ని దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన గొల్ల బాబురావు, పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు తిప్పల నాగిరెడ్డి, గాజువాక నియోజకవర్గ పరిశీలకుడు పసుపులేటి బాలరాజు పాల్గొని ర్యాలీని ఉద్దేశించి మాట్లాడారు.
  
- చిత్తూరులో భారీ నిరసన ర్యాలీ 
“చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా చిత్తూరు నియోజకవర్గంలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. గంగినేని చెరువు నుంచి గాంధీ బొమ్మ వరకు జరిగిన ఈ ర్యాలీకి చిత్తూరు నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జి ఎం.సి. విజయానంద రెడ్డి నాయకత్వం వహించారు. ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రెండేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని నాయకులు విమర్శించారు. అనంతరం గాంధీ సర్కిల్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో “సూపర్ సిక్స్” హామీలకు సంబంధించిన పోస్టర్లను దగ్ధం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలు కేవలం ప్రచారానికే పరిమితమయ్యాయని, వాటి అమలులో ప్రభుత్వం విఫలమైందని వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు ఆరోపించారు.  

- నందికొట్కూరులో భారీ ర్యాలీ 
“చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా నందికొట్కూరులో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త సుదీర్ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా పటేల్ కూడలి వరకు కొనసాగింది. ర్యాలీలో పాల్గొన్న వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. నందికొట్కూరులో నిర్వహించిన ఈ భారీ ర్యాలీకి విశేష స్పందన లభించగా, పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొని తమ నిరసన గళాన్ని వినిపించారు.

- ఆత్మకూరులో భారీ నిరసన ర్యాలీ.. 
చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరు పట్టణంలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పోలీసుల ఆంక్షల నేపథ్యంలో నంద్యాల టర్నింగ్ నుంచి గౌడ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించిన వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు, చంద్రబాబు ఎన్నికల సమయంలో విడుదల చేసిన మేనిఫెస్టో ప్రతులను చేతబట్టి నిరసన తెలిపారు. ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల ముందు అమలు చేయలేని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు, ఇప్పుడు “సూపర్ సిక్స్” హామీలను పూర్తిగా పక్కన పెట్టారని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించి రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు.  

- కర్నూలులో వైయ‌స్ఆర్‌సీపీ భారీ నిరసన ర్యాలీ
“చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా కర్నూలులో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపిస్తూ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. వైయ‌స్ఆర్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆర్ఎస్ రోడ్డు నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ కర్నూలు పార్లమెంట్ ఇన్‌చార్జి బుట్టా రేణుకతో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎన్నికల హామీల అమలులో వైఫల్యం, పెరుగుతున్న ధరలు, నిరుద్యోగ సమస్యలు, సంక్షేమ పథకాల అమలులో జాప్యాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆర్ఎస్ రోడ్డు నుంచి జిల్లా పరిషత్ వరకు సాగిన ఈ నిరసన ర్యాలీతో కర్నూలు నగరంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. 

- కావలిలో భారీ నిరసన ర్యాలీ 
“వెన్నుపోటు పాలనకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా కావలి పట్టణంలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ ఇన్‌చార్జి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో సుమారు రెండు వేల మందికి పైగా వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ పట్టణ ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడారు.

- రాజాంలో  వైయ‌స్ఆర్‌సీపీ ఆందోళన 
“వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా రాజాం అసెంబ్లీ నియోజకవర్గంలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్ డా. రాజేష్ తలే నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమానికి స్థానిక ప్రజలు కూడా స్వచ్ఛందంగా పాల్గొని ప్రస్తుత ప్రభుత్వ విధానాలపై తమ ఆవేదన, అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు నాయకులు తెలిపారు.  

- నెల్లిమర్లలో  భారీ ర్యాలీ 
“చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా నెల్లిమర్ల నియోజకవర్గంలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నెల్లిమర్ల మండలం థామస్ పేట సినిమా హాల్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ నగర పంచాయతీ పరిధిలోని ఎస్‌బీఐ బ్యాంకు వరకు కొనసాగింది. ర్యాలీలో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు పెనుమత్స సురేష్ బాబు, నియోజకవర్గ పరిశీలకులు నెక్కల నాయుడు బాబు, జోన్–II ఐటీ ఇన్‌చార్జి బడ్డుకొండ మణిదీప్ నాయుడు, యువజన అధ్యక్షుడు బడ్డుకొండ ప్రదీప్ నాయుడు పాల్గొన్నారు. అలాగే నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు పతివాడ అప్పలనాయుడు, చిక్కాల సాంబ, గదల సన్యాసి నాయుడు, పిన్నింటి తమ్మినాయుడు, జడ్పీటీసీ ప్రతినిధులు, వైస్ ఎంపీపీలు, రాష్ట్ర స్థాయి కార్యదర్శులు, మాజీ ప్రజాప్రతినిధులు, బీసీ, ఎస్సీ విభాగ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. 

- కడప నగరంలో వైయ‌స్ఆర్‌సీపీ భారీ గర్జన.. 
“చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా కడప నియోజకవర్గంలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. జిల్లా కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ నగరంలోని ప్రధాన వీధుల గుండా సాగి ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఈ కార్యక్రమానికి మాజీ డిప్యూటీ సీఎం, కడప నియోజకవర్గ సమన్వయకర్త ఎస్.బి. అంజాద్ భాషా, సీఈసీ సభ్యులు కే. సురేష్ బాబు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సుబ్బారెడ్డి, మాజీ మేయర్ పాకా సురేష్, కడప అబ్జర్వర్ గురుమోహన్, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి షేక్ ఉమర్ తదితరులు హాజరయ్యారు.  వైయ‌స్ జగన్‌మోహన్ రెడ్డి హయాంలో అమలైన సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేశారని, ప్రజలపై భారాలు మోపారని నాయకులు మండిపడ్డారు. కడపకు చెప్పుకోదగ్గ అభివృద్ధి పనులు కూడా రెండేళ్లలో జరగలేదని విమర్శించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ప్రభుత్వ వైఫల్యాలకు తగిన సమాధానం చెబుతారని, వైయ‌స్ఆర్‌సీపీకి మళ్లీ మద్దతు లభిస్తుందని నాయకులు ధీమా వ్యక్తం చేశారు.  

- ఆలూరులో భారీ నిరసన ర్యాలీ 
“చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా ఆలూరులో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే వీరుపాక్షి నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ర్యాలీలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. “అక్కచెల్లెమ్మలకు ఇస్తానన్న ఆడబిడ్డ నిధి ఎక్కడ బాబు?”, “నిరుద్యోగులకు ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఎక్కడ బాబు?” అంటూ ప్రభుత్వ హామీల అమలుపై ప్రశ్నిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీరుపాక్షి మాట్లాడారు. 

- పత్తికొండలో భారీ ర్యాలీ 
“చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా పత్తికొండలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ప్రజల సమస్యలను ఎత్తిచూపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి మాట్లాడారు.  

- ఆదోనిలో కరపత్రాల దహనం 
“కూటమి ప్రభుత్వం వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా ఆదోనిలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ నాయకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది.  భీమాస్ సర్కిల్ వద్ద వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు ప్రభుత్వ హామీలకు సంబంధించిన కరపత్రాలను దగ్ధం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ ర్యాలీ నిర్వహించారు. 

- కోసిగిలో భారీ ర్యాలీ 
“చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా కోసిగిలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ నేత వై. ప్రదీప్ రెడ్డి నాయకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. సుమారు 9 వేల మందికి పైగా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్న ఈ ర్యాలీ కోసిగిలోని నాడిగేని ఏరియా నుంచి వైయస్సార్ సర్కిల్ వరకు కొనసాగింది. భారీ సంఖ్యలో ప్రజలు, పార్టీ శ్రేణులు పాల్గొని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

- తిరువూరులో  భారీ ర్యాలీ..  
“వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా తిరువూరు నియోజకవర్గంలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలని, ప్రజా తీర్పును గౌరవించాలని కోరుతూ జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యాయి.  ఈ ర్యాలీకి తిరువూరు నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లగట్ల స్వామిదాస్ నాయకత్వం వహించారు. నియోజకవర్గంలోని వివిధ మండలాలు, గ్రామాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నల్లగట్ల స్వామిదాస్ మాట్లాడారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, పెన్షన్ హామీలు సహా అనేక వాగ్దానాలను ప్రభుత్వం పక్కనపెట్టిందని ఆయన విమర్శించారు. పెట్రోలు, డీజిల్ ధరల తగ్గింపుపై ఇచ్చిన హామీలు కూడా నెరవేరలేదని పేర్కొన్నారు.  

- డోన్‌లో నిర‌స‌న కార్యక్రమం..  
“వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా డోన్‌లో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవకపోతే రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ప్రజల సమస్యలను పరిష్కరించకుండా పాలన కొనసాగించడం సరికాదని బుగ్గ‌న‌ పేర్కొన్నారు. 

- మైదుకూరులో  భారీ నిరసన ర్యాలీ 
వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు మైదుకూరులో “కూటమి పాలన వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రొద్దుటూరు రోడ్‌లోని మూలబాట నుండి కడప రోడ్డులోని వైయస్సార్ విగ్రహం వరకు ఈ నిరసన ర్యాలీ కొనసాగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని కూటమి ప్రభుత్వ విధానాలపై తమ నిరసనను వ్యక్తం చేశారు.  

- పెడనలో నిరసన ప్ర‌ద‌ర్శ‌న‌
“వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా పెడనలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ ఇన్‌చార్జి ఉప్పాల రాము నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యాయి. వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయం నుంచి బంటుమిల్లి రోడ్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. “సూపర్ సిక్స్” హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా జడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక పాల్గొన్నారు.  

- చంద్రగిరిలో టీడీపీ మేనిఫెస్టో దహనం 
“కూటమి ప్రభుత్వ వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా చంద్రగిరిలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి, చల్లా రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు.
ర్యాలీ అనంతరం వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు కూటమి ప్రభుత్వ మేనిఫెస్టో ప్రతులను దహనం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. అనంతరం చంద్రగిరి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ,  నిరుద్యోగ భృతి, మహిళలకు ఆడబిడ్డ నిధి వంటి పథకాలు ఇప్పటికీ అమలు కాలేదని ఆరోపించారు. “ఏం సాధించారని సంబరాలు చేసుకుంటున్నారు” అని ప్రశ్నించిన ఆయన, ప్రభుత్వం మోసాలకు, దాడులకు, భూకబ్జాలకు కేరాఫ్‌గా మారిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు ప్రతి కార్యకర్త పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. 

- బుక్కపట్నంలో  భారీ ర్యాలీ 
“చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా బుక్కపట్నంలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి నాయకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. 
ర్యాలీలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. 

- ప్రకాశం జిల్లాలో భారీ ర్యాలీ 
“చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లాలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి నాయకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. 
ర్యాలీలో వేలాది మంది పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కదం తొక్కారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాలో ప్రధాన మార్గాల గుండా సాగిన ఈ ర్యాలీతో స్థానికంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వ వైఫల్యాలపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి.

- అద్దంకిలో భారీ నిరసన ర్యాలీ 
“కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా అద్దంకిలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ నాయకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. భవాని సెంటర్ నుంచి బంగ్లా రోడ్ వరకు సాగిన ఈ ర్యాలీలో వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపిస్తూ ర్యాలీ అంతా నినాదాలతో హోరెత్తింది. ఈ సందర్భంగా చింతలపూడి అశోక్ కుమార్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, “సూపర్ సిక్స్” పేరుతో ప్రజలను మోసం చేస్తూ కూటమి ప్రభుత్వం “సూపర్ ట్రాప్” వేసిందని విమర్శించారు. 

- రాజమండ్రిలో ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
“కూటమి వెన్నుపోటు పాలనకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి కోటగుమ్మం సెంటర్ వద్ద వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎంపీ భరత్ నాయకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. కోటగుమ్మం సెంటర్‌లో ప్లకార్డులతో ఆందోళన ప్రారంభించిన వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు అనంతరం కోటగుమ్మం నుంచి డీలక్స్ సెంటర్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయితే ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోటగుమ్మం సెంటర్ వద్దే మాజీ ఎంపీ భరత్, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. 

- మైల‌వ‌రంలో పోటెత్తిన నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌
మైలవరం నియోజకవర్గంలో వైయ‌స్ఆర్‌సీపీ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌కు ప్ర‌జ‌లు పోటెత్తారు.  మాజీ మంత్రి జోగి రమేష్ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు “వెన్నుపోటు” రాజకీయాలకు ప్రతిరూపమని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. రైతాంగాన్ని తీవ్రంగా నష్టపరిచారని, మొక్కజొన్నకు గిట్టుబాటు ధర కూడా ఇవ్వలేకపోయారని విమర్శించారు. వైఎస్ జగన్ పాలనలో ప్రజలు పండుగలను ఆనందంగా జరుపుకున్నారని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని అన్నారు. “సూపర్ సిక్స్” హామీలు సహా అనేక వాగ్దానాలు అమలు కాలేదని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు పార్టీని “వెన్నుపోటు పార్టీ”గా అభివర్ణించిన జోగి రమేష్, వైయ‌స్ఆర్‌సీపీ “విలువలు, విశ్వసనీయతతో ఉన్న పార్టీ” అని అన్నారు. రాజకీయంగా ఎదుర్కొనలేక కూటమి నేతలు కలిసి పోటీచేశారని వ్యాఖ్యానించారు. 

- రామచంద్రపురంలో భారీ నిరసన ర్యాలీ 
 “చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా రామచంద్రపురంలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ ఇన్‌చార్జి సూర్యప్రకాష్ నాయకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప. పిల్లి సుభాష్ చంద్రబోస్ పాల్గొన్నారు. రామచంద్రపురం ఎల్ఐసి ఆఫీసు వద్ద ప్రారంభమైన ర్యాలీ రాజగోపాల్ సెంటర్ వరకు కొనసాగింది. 

- కాకినాడలో  బైక్ ర్యాలీ 
“వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా కాకినాడలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. 
మెయిన్ రోడ్ నుండి జగన్నాధపురం మున్సిబ్ గారి జంక్షన్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో నగర వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షురాలు సుంకర శివ ప్రసన్న, కుడా మాజీ చైర్మన్ చంద్రకళా దీప్తి, మాజీ డిప్యూటీ మేయర్ పసుపులేటి విజయలక్ష్మి పాల్గొన్నారు. 

- ధర్మవరంలో భారీ నిరసన ర్యాలీ 
“చంద్రబాబు వెన్నుపోటు రెండేళ్ల పాలన”ను నిరసిస్తూ ధర్మవరంలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కేతిరెడ్డి వెంకట కృష్ణారెడ్డి నివాసం నుండి ఈ ర్యాలీ నిర్వ‌హించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ర్యాలీ పట్టణ ప్రధాన మార్గాల గుండా కొనసాగింది.  

-  మదనపల్లెలో  భారీ నిరసన ర్యాలీ 
“చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా మదనపల్లెలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ నాయకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. మిషన్ కాంపౌండ్ నుండి కలెక్టరేట్ మీదుగా చిత్తూరు బస్టాండ్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు వివిధ స్థాయి ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

- గుంతకల్లులో  భారీ నిరసన ర్యాలీ 
“సూపర్ సిక్స్ సూపర్ మోసం” అంటూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలతో గుంతకల్లులో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. గుంతకల్లు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, సమన్వయకర్త వై. వెంకట్రామిరెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది. అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు వై. నైరుతి రెడ్డి నాయకత్వంలో వైవీఆర్ క్యాంపు కార్యాలయం నుండి పొట్టి శ్రీరాములు సర్కిల్ మీదుగా వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. వేలాది మంది కార్యకర్తలు, మహిళలు, యువత, రైతులు, కార్మికులు పాల్గొన్నారు. 

- గూడూరులో ఆర్డీవో కార్యాలయం వద్ద ఆందోళన 
 “కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా గూడూరు నియోజకవర్గంలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్సీ మేరీగా, రాష్ట్ర నాయకులు శ్యామ్ ప్రసాద్ రెడ్డి నాయకత్వంలో ఈ ఆందోళన చేపట్టారు. గూడూరు టవర్ క్లాక్ నుండి ఆర్డీవో కార్యాలయం వరకు భారీ ర్యాలీ కొనసాగింది. అనంతరం ఆర్డీవో కార్యాలయం ఎదుట వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు ఆందోళన చేపట్టి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

- పామర్రులో నిరసన ర్యాలీ 
“వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా పామర్రులో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ నాయకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలకు ఎలాంటి ఉపయోగకరమైన పనులు చేయలేదని విమర్శించారు. “సూపర్ సిక్స్” పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. 

- గుంటూరు తూర్పులో దిష్టిబొమ్మ దహనం 
 “వెన్నుపోటు దీనోత్సవం” సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. నూరి ఫాతిమా నాయకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. 

- గజపతినగరంలో  భారీ నిరసన ర్యాలీ
“కూటమి ప్రభుత్వం వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా గజపతినగరంలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య నాయకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన ఈ ర్యాలీలో యువ నాయకులు బొత్స గురునాయుడు, నియోజకవర్గ పరిశీలకులు జగన్మోహనరావు పాల్గొన్నారు. ఐదు మండలాల నుంచి ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, రైతు, మహిళా, యువజన విభాగాల సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. 


 - చీపురుపల్లిలో భారీ ర్యాలీ
వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌మోహన్ రెడ్డి పిలుపు మేరకు చీపురుపల్లి నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన “వెన్నుపోటుకు రెండేళ్లు” నిరసన ర్యాలీ భారీ విజయాన్ని సాధించింది. ఈ కార్యక్రమానికి శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చీపురుపల్లి సిటీ కేబుల్ సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద ప్రారంభమైన ర్యాలీ గాంధీ సెంటర్ వరకు కొనసాగింది. వేలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనడంతో చీపురుపల్లి పట్టణం నినాదాలతో మార్మోగింది. మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, డాక్టర్ బొత్స అనూష, డాక్టర్ బొత్స సందీప్ తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సూపర్ సిక్స్ హామీలు నేటికీ అమలు కాలేదని, నిరుద్యోగం, ధరల పెరుగుదల, అభివృద్ధి మందగమనంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రజల సమస్యలను విస్మరించి ప్రభుత్వం ప్రచారాలకే పరిమితమైందని మండిపడ్డారు.  

- కాకినాడ రూరల్‌లో   బైక్ ర్యాలీ 
“వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. యువత, మహిళలు, రైతులకు కూటమి ప్రభుత్వం చేసిన మోసాలు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేసే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టారు. కాకినాడ రూరల్ నియోజకవర్గ క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ నాగమల్లి తోట జంక్షన్, సర్పవరం జంక్షన్ మీదుగా కాకినాడ రూరల్ ఎంఆర్వో కార్యాలయం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ ఉమ్మడి విశాఖపట్నం–విజయనగరం జిల్లాల రీజినల్ కో-ఆర్డినేటర్  కురసాల కన్నబాబు పాల్గొన్నారు.  

- నరసన్నపేటలో భారీ నిరసన ర్యాలీ 
“చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా నరసన్నపేట నియోజకవర్గ కేంద్రంలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ డిప్యూటీ సీఎం, జిల్లా పార్టీ అధ్యక్షుడు  ధర్మాన కృష్ణదాస్ నేతృత్వంలో వైయ‌స్ఆర్‌ జంక్షన్, అంబేద్కర్ విగ్రహం మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు కొనసాగింది.  కార్య‌క్ర‌మంలో డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య, కుంభా రవిబాబు, నియోజకవర్గ పరిశీలకుడు అంధవరపు సూరిబాబు, నరసన్నపేట ఎంపీపీ అరంగి మురళీధర్, పోలాకి ఎంపీపీ ముద్దాడ బైరాగి నాయుడు, జలుమూరు ఎంపీపీ వాన గోపీతో పాటు నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. 

- కళ్యాణదుర్గంలో ఉద్రిక్తత..  
“చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా కళ్యాణదుర్గంలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ నిరసన ర్యాలీ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎంపీ  తలారి రంగయ్య నేతృత్వంలో పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందంటూ కార్యకర్తలు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.  

- అమలాపురంలో భారీ బైక్ ర్యాలీ 
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ అమలాపురంలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. “వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఈ నిరసన కార్యక్రమం ఘన విజయవంతమైంది. మాజీ మంత్రి, పీఏసీ సభ్యుడు, అమలాపురం పార్లమెంట్ కో-ఆర్డినేటర్ **పినిపే విశ్వరూప్** అధ్యక్షతన, అమలాపురం నియోజకవర్గ కో-ఆర్డినేటర్  డాక్టర్ పినిపే శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 

- నాయుడుపేటలో నిరసన ర్యాలీ 
కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నాయుడుపేట పట్టణంలో “వెన్నుపోటుకు రెండేళ్లు” నిరసన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాలు, ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి సూచనల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. సీ.ఎస్. తేజ సర్కిల్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు మాజీ సూళ్లూరుపేట ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త  కిలివేటి సంజీవయ్య  ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, మహిళలు, యువత, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

- పాలకొల్లులో భారీ బైక్ ర్యాలీ 
వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, “చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా పాలకొల్లు నియోజకవర్గంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్ గుడాల శ్రీహరి గోపాలరావు (గోపి) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించిన ఈ నిరసన ర్యాలీలో పాలకొల్లు నియోజకవర్గ పరిశీలకులు పెరిచర్ల విజయ నర్సింహారాజు, ఎమ్మెల్సీ కవరు శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి ఎడ్ల తాతాజీ, మాజీ ఎమ్మెల్సీ మేక శేషుబాబు, ఎస్సీ కమిషన్ సభ్యుడు చెల్లం ఆనంద్ ప్రకాష్, జడ్పీటీసీ నడపన గోవిందరాజు, ఎలమంచిలి ఎంపీపీ ధనలక్ష్మి రవికుమార్, పట్టణ అధ్యక్షుడు కోరాడ శ్రీనివాస్, యలమంచిలి మండల అధ్యక్షుడు ఉచ్చుల స్టాలిన్, పాలకొల్లు మండల అధ్యక్షుడు పెన్మత్స యేసురాజు, రాష్ట్ర అంగన్‌వాడీ ఉపాధ్యక్షురాలు మద్దా చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. 

- భీమవరంలో భారీ నిరసన ర్యాలీ 
వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రెండేళ్లుగా కొనసాగిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనకు నిరసనగా “వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమాన్ని భీమవరం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన భారీ ర్యాలీలో భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి చినిమిల్లి వెంకటరాయుడు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి కామన నాగేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు గాదిరాజు రామరాజు, వీరవాసరం మండల అధ్యక్షుడు చావకుల సత్యనారాయణతో పాటు పార్టీ ముఖ్య నాయకులు, అనుబంధ విభాగాల రాష్ట్ర కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

- రాయదుర్గంలో హోరెత్తిన వైయ‌స్ఆర్‌సీపీ నిరసన ర్యాలీ
“చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా రాయదుర్గం నియోజకవర్గంలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళలు, రైతులు, నిరుద్యోగులు, డీఎస్సీ బాధితులు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో హాజరై కూటమి ప్రభుత్వంపై తమ నిరసన వ్యక్తం చేశారు.  
వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు, ప్రజలకు అందించిన సేవలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని, గ్రామాల్లో ఇప్పటికే మార్పు ప్రారంభమైందని పార్టీ ఇన్చార్జ్ మెట్టు గోవింద‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయకపోతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. 

-  బద్వేలులో హోరెత్తిన వైయ‌స్ఆర్‌సీపీ నిరసన ర్యాలీ 
వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు బద్వేలు నియోజకవర్గంలో “కూటమి పాలన వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ డి.సి. గోవిందరెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధ, వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్య రెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ నిరసన ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సిద్ధవటం ఎన్జీవో కాలనీ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ నాలుగు కూడళ్ల మీదుగా ఆర్డీవో కార్యాలయం వరకు కొనసాగింది. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో పట్టణం మార్మోగిపోయింది. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి, అట్లూరు మండల పార్టీ అధ్యక్షుడు ముడుమాల ప్రభాకర్ రెడ్డి, నియోజకవర్గ బూత్ కన్వీనర్ల ఇన్‌చార్జ్ రమణారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బోవిళ్ల చిన్న సూరారెడ్డి తదితర నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- కోడుమూరులో హోరెత్తిన వైయ‌స్ఆర్‌సీపీ భారీ నిరసన ర్యాలీ
వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్‌మోహన్ రెడ్డి పిలుపు మేరకు నిర్వహిస్తున్న “చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా కోడుమూరు నియోజకవర్గంలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ర్యాలీ సందర్భంగా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని కోడుమూరు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ డాక్ట‌ర్ ఆదిమూల‌పు స‌తీష్ గారు విమర్శించారు. సూపర్ సిక్స్ హామీలు, నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, రైతు సంక్షేమ పథకాలు తదితర అంశాల్లో ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు.  

- ఎలమంచిలిలో 10 కిలోమీటర్ల భారీ బైక్ ర్యాలీ 
వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు “చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో సుమారు 10 కిలోమీటర్ల మేర సాగిన ఈ ర్యాలీలో దాదాపు 2,000 మంది పాల్గొని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిశీలకులు కోలా గురువులు, ఎస్సీ సెల్ సభ్యుడు బోదేపు గోవిందు, రాష్ట్ర సహాయ కార్యదర్శి బోదేపు ఎర్రయ్యదొరతో పాటు నియోజకవర్గంలోని జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 
 
- రావులపాలెంలో వినూత్న నిర‌స‌న‌
కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి విమర్శించారు. వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం రావులపాలెంలో “వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, కొత్తపేట నియోజకవర్గ పరిశీలకుడు పాటి శివకుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఉదయం రావులపాలెం డిగ్రీ కళాశాల మైదానం నుంచి వైయ‌స్ఆర్‌సీపీ క్యాంపు కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

- శృంగవరపుకోటలో వైయ‌స్ఆర్‌సీపీ భారీ నిరసన ర్యాలీ 
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని శృంగవరపుకోట నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు విమర్శించారు. వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న “వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా శుక్రవారం శృంగవరపుకోటలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.
ఎస్.కోట సంజీవిని హాస్పిటల్‌ నుంచి దేవిగుడి జంక్షన్‌ వరకు సాగిన ఈ ర్యాలీకి నియోజకవర్గ పరిశీలకురాలు కె. భాగ్యలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ వేచలపు చినరామునాయుడు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గొరపల్లి శివ, జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్‌తో పాటు ఐదు మండలాలకు చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, వివిధ అనుబంధ విభాగాల నాయకులు, సోషల్ మీడియా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
 
- సూపర్ సిక్స్ హామీలను గాలికొదిలేశారు 
- కూటమి పాలనపై ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఘాటు విమర్శలు

యర్రగొండపాలెం : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. వైయ‌స్ఆర్‌సీపీ పిలుపు మేరకు శుక్రవారం యర్రగొండపాలెంలో “వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.  ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు, వాటిని పూర్తిగా గాలికొదిలేశారని ఆరోపించారు. సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను నమ్మించి ఇప్పుడు ఆ హామీల గురించి మాట్లాడటానికే ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు సహా అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ వైఫల్యాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేస్తూ “ప్యాకేజీ స్టార్ కాదు.. ఇప్పుడు క్యాబేజీ స్టార్‌గా మారిపోయారు” అని వ్యాఖ్యానించారు. ప్రజల సమస్యలపై స్పందించాల్సిన వారు అధికారంలో ఉన్నా మౌనంగా ఉంటున్నారని అన్నారు. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనతో పోల్చుకుంటే కూటమి ప్రభుత్వం 10 శాతం పాలన కూడా చేయలేదని తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా వైయస్ జగన్ ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రజలకు అండగా నిలిచారని గుర్తు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, లేకపోతే ప్రజలే రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

- మధురవాడలో “వెన్నుపోటుకు రెండేళ్లు” భారీ నిరసన ర్యాలీ
- ప్రజల సమస్యలపై పోరాటం కొనసాగుతుంది: మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)

 మధురవాడ 2: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్, వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) విమర్శించారు. వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న “వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా శుక్రవారం భీమిలి నియోజకవర్గంలోని మధురవాడలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మిధునాపురి ఉడా కాలనీలోని గాంధీ విగ్రహం వద్ద ప్రారంభమైన ర్యాలీ రిజిస్ట్రార్ కార్యాలయం రోడ్ వరకు కొనసాగింది.

మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మజ్జి సిరి సహస్ర (సిరమ్మ), నియోజకవర్గ పరిశీలకుడు తైనాల విజయ్ కుమార్ పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మహిళా నాయకులు, సోషల్ మీడియా కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ గత రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందన్నారు. ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలు నేటికీ అమలు కాకపోవడంతో ప్రజలు తీవ్ర నిరాశకు గురవుతున్నారని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలులో జాప్యం, నిరుద్యోగ సమస్య, రైతులు, మహిళలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు. ప్రజల సమస్యలను పక్కనపెట్టి ప్రచార రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తున్న కూటమి ప్రభుత్వ వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగట్టడానికే “వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజల హక్కులు, సంక్షేమం, రాష్ట్ర భవిష్యత్తు కోసం వైయ‌స్ఆర్‌సీపీ ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. 

- దద్దరిల్లిన మంగళగిరి.. వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణుల మహా గర్జన
మంగళగిరి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు మంగళగిరి నియోజకవర్గంలో “వెన్నుపోటుకు రెండేళ్లు” పేరుతో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి నాయకత్వంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గళం వినిపించారు. మంగళగిరి నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయం వద్ద ప్రారంభమైన కార్యక్రమం మిద్దె సెంటర్ మీదుగా గాలి గోపురం వరకు భారీ బైక్ ర్యాలీగా కొనసాగింది. అనంతరం గాలి గోపురం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు పాదయాత్ర నిర్వహించి ప్రభుత్వ విధానాలను నిరసించారు. నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, రాష్ట్ర ఆప్కో చైర్మన్ ఛిల్లపల్లి మోహనరావు, నియోజకవర్గ పరిశీలకుడు యార్లగడ్డ మదన్ మోహన్, మంగళగిరి టౌన్ అధ్యక్షుడు ఆకురాతి రాజేష్, మంగళగిరి రూరల్ అధ్యక్షుడు నాలి వెంకటకృష్ణ, తాడేపల్లి టౌన్ అధ్యక్షుడు బుర్రముక్కు వేణుగోపాలస్వామి రెడ్డి, తాడేపల్లి రూరల్ అధ్యక్షుడు అమర నాగయ్య, దుగ్గిరాల మండల అధ్యక్షుడు తాడిబోయిన శివగోపయ్యతో పాటు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

- రాయలసీమ రైతుల కన్నీళ్లపై అమరావతి నిర్మాణం: డా. సాకే శైలజానాథ్
 శింగనమల : రాయలసీమ రైతుల కన్నీళ్ల మీద అమరావతి నిర్మాణం సాగుతోందని మాజీ మంత్రి, శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త డా. సాకే శైలజానాథ్ తీవ్ర విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైయ‌స్ఆర్‌సీపీ చేపట్టిన  “చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా శుక్రవారం శింగనమల మండల కేంద్రంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. దర్గా నుంచి ఆత్మరాముడి దేవాలయం వరకు సాగిన ఈ ర్యాలీలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు ఎల్‌.ఎం. మోహన్‌రెడ్డి, మండల అధ్యక్షులు, అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డా. సాకే శైలజానాథ్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ప్రకటించిన  సూపర్ సిక్స్ హామీలు  ప్రజలకు అందలేదని విమర్శించారు. సినిమా ఫ్లాప్ అయినా హిట్ అని ప్రచారం చేసినట్లే, కూటమి ప్రభుత్వం కూడా తన వైఫల్యాలను విజయాలుగా చూపించేందుకు ప్రయత్నిస్తోందని ఎద్దేవా చేశారు. 50 ఏళ్లు దాటిన అర్హులైన పలువురికి పింఛన్లు అందడం లేదని, మహిళలకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆరోపించారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి అందడం లేదని, రాయలసీమ సాగునీటి సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. రైతులు పండించిన పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేసిన సంక్షేమ పాలనపై ప్రజల్లో ఉన్న విశ్వాసమే ఈ నిరసన కార్యక్రమానికి భారీ స్పందన రావడానికి కారణమని శైలజానాథ్ అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.
 

Back to Top