భగవాన్‌ శ్రీ వెంకయ్య స్వామివారి ఆశీస్సులు జగనన్నకు ఉండాలి

44వ ఆరాధన మహోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన కాకాణి పూజిత

నెల్లూరు జిల్లా: వెంకటాచలం మండలం గొలగమూడి గ్రామంలోని భగవాన్‌ శ్రీ వెంకయ్య స్వామివారి 44వ ఆరాధన మహోత్సవ వేడుకల్లో వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కాకాణి పూజిత పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గొలగమూడికి చేరుకున్న పూజితకు మహిళలు, వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా కాకాణి పూజిత మాట్లాడుతూ భగవాన్‌ శ్రీ వెంకయ్య స్వామివారిని దర్శించుకోవడం మహా భాగ్యంగా భావిస్తున్నానని తెలిపారు. తమ తండ్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి వెంకయ్య స్వామివారి సేవ చేసే అవకాశం పదేళ్లపాటు లభించడం తమ కుటుంబానికి ఎంతో ప్రత్యేకమని పేర్కొన్నారు.

స్వామివారి ఆశీస్సులు తమ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. గొలగమూడికి రాగానే ఎంతటి కష్టం, ఎంతటి భారం ఉన్నా క్షణాల్లో తీరిపోయిన భావన కలుగుతుందని అన్నారు. భగవంతుని కృపాకటాక్షాలు తమ కుటుంబంతో పాటు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించారు. వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి భగవాన్‌ శ్రీ వెంకయ్య స్వామివారి ఆశీస్సులు లభించి, ఆయన మళ్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవలు అందించాలని పూజిత ఆకాంక్షించారు.
 

Back to Top