ఒమన్‌ తీర ఘటనలో విశాఖ మెరైన్‌ ఇంజినీర్‌ మృతి బాధాకరం

వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ 

తాడేపల్లి: ఒమన్‌ తీరంలో భారతీయులు ప్రయాణిస్తున్న నౌకపై జరిగిన దాడి ఘటనలో విశాఖపట్నానికి చెందిన మెరైన్‌ ఇంజినీర్‌ సురేశ్‌ పట్నాల మృతిచెందడం అత్యంత విషాదకరమని మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ ఘటనలో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సురేశ్‌ పట్నాల ఉండటం మరింత కలచివేసిందని ఆయన అన్నారు. ఒక మెరైన్‌ ఇంజినీర్‌ ఇలా అకాల మరణం చెందడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

సురేశ్‌ను కోల్పోయిన కుటుంబం ఎదుర్కొంటున్న వేదన మాటల్లో చెప్పలేనిదని వైయస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుడు సురేశ్‌ పట్నాల కుటుంబ సభ్యులు ఈ తీరని దుఃఖాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని దేవుడు ప్రసాదించాలని కోరారు. అలాగే సురేశ్‌ పట్నాల ఆత్మకు శాంతి చేకూరాలని వైయస్ జగన్ ఆకాంక్షించారు.
 

Back to Top