ముస్తఫా, బషీర్‌కు త్వరగా బెయిల్ రావాలని ప్రత్యేక పూజలు

గుంటూరు: న‌గ‌రంలోని కొత్తపేట శివాలయంలో వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా, నగర ట్రేడ్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మొహమ్మద్‌ ముస్తఫా, ఆయన కుమారుడు బషీర్‌కు త్వరగా బెయిల్‌ రావాలని కోరుతూ ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ నాయకులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా, నగర ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షులు, సభ్యులు, పార్టీ వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ముస్తఫా, బషీర్‌ త్వరగా బెయిల్‌పై బయటకు రావాలని, వారు క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
 

Back to Top