వైయస్‌ఆర్ కడప జిల్లా: మహిళా నాయకురాళ్లు కడప నగరంలోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో కడప పార్లమెంటు సభ్యులు వైయస్ అవినాష్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా మహిళా అధ్యక్షురాలు తెలుగుపులి వెంకటసుబ్బమ్మ, కోడూరు మహిళా అధ్యక్షురాలు లక్ష్మి, రాష్ట్ర మహిళా కార్యదర్శి కృష్ణవేణి తదితరులు ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డిని కలిసి జిల్లాలో మహిళలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను వివరించారు. మహిళల సమస్యల పరిష్కారంతో పాటు భవిష్యత్‌లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించి, ఎంపీ నుంచి తగిన సూచనలు, సలహాలు స్వీకరించారు. మహిళల అభ్యున్నతికి, వారి హక్కుల పరిరక్షణకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఈ సందర్భంగా వైయస్ అవినాష్‌రెడ్డి భరోసా ఇచ్చారు. మహిళా సాధికారత, సంక్షేమం కోసం సమష్టిగా ముందుకు సాగాలని నాయకురాళ్లు స్పష్టం చేశారు.