గోరుకల్లు నుంచి ఎస్‌ఆర్‌బీసీకి తక్షణమే నీరు విడుదల చేయాలి

నంద్యాల జిల్లా క‌లెక్ట‌ర్‌కు వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్య‌క్షుడు కాటసాని రామభూపాల్‌రెడ్డి విన‌తి

నంద్యాల: గోరుకల్లు జలాశయం నుంచి శ్రీశైలం కుడి శాఖా కాలువ (ఎస్‌ఆర్‌బీసీ)కు తక్షణమే నీటిని విడుదల చేయాలని వైయ‌స్ఆర్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్‌రెడ్డి నంద్యాల జిల్లా కలెక్టర్‌ను కోరారు. ఈ మేరకు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

ఎస్‌ఆర్‌బీసీ కాలువపై ఆధారపడిన ఆయకట్టు రైతులు సాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పటికే సాగు చేసిన పంటలను కాపాడుకోవడానికి వెంటనే నీటిని విడుదల చేయాల్సిన అవసరం ఉందని కాటసాని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. గోరుకల్లు జలాశయంలో నీటి లభ్యతను పరిశీలించి, సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించి పాణ్యం, బనగానపల్లె నియోజకవర్గాల రైతులకు సాగునీటితో పాటు ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేలా ఎస్‌ఆర్‌బీసీకి నీటిని విడుదల చేయాలని కోరారు.
 

Back to Top