తూర్పు గోదావరి జిల్లా: కృష్ణా జిల్లా జెడ్పీ ఛైర్‌పర్సన్ ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన గూండాల దాడి ఆటవిక చర్యగా మాజీమంత్రి, తూర్పు గోదావరి జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ అభివర్ణించారు. ఉప్పాల హారికపై దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.`జిల్లా ప్రధమ మహిళపై టీడీపీ, జనసేన గూండాలు దాడి చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం దారుణం. రాష్ట్రంలో ఆటవికపాలన నడుస్తోంది. కూటమి పార్టీల కార్యకర్తలు బరితెగించి పట్టపగలే దాడికి పాల్పడ్డం అత్యంత దుర్మార్గం. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లు దీనికేం సమాధానం చెబుతారు. సాటి మహిళా ప్రజాప్రతినిధిపై దాడి జరిగినా మహిళా హోంమంత్రి అనిత ఎందుకు స్పందించడం లేదు. సరైన సమయంలో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు` అని చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ హెచ్చరించారు.