బాపట్ల: కృష్ణా జిల్లా జెడ్పీ ఛైర్‌పర్సన్ ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన గూండాల దాడి ఉన్మాద చర్య. బీసీ మహిళపై ఇంత బరితెగించి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. `రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైయస్ఆర్‌సీపీ ని టార్గెట్ చేశారు. ఇంత దారుణమైన పాలన ఎన్నడూ చూడలేదు. ఇది ప్రజాస్వామ్య పాలనా లేక ఆటవిక రాజ్యమా. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ మీ అరాచకాలన్నీ గుర్తుపెట్టుకుంటాం. తగిన గుణపాఠం తప్పదు` మేరుగ నాగార్జున ఓ ప్రకటనలో హెచ్చరించారు.