హారికపై విచక్షణారహితంగా దాడికి పాల్పడడం దారుణం

మాజీ మంత్రి  ఉషాశ్రీచరణ్‌

శ్రీ‌స‌త్య‌సాయి జిల్లా: కృష్ణా జిల్లా జెడ్పీ ఛైర్‌పర్సన్‌ ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని మాజీ మంత్రి  ఉషాశ్రీచరణ్ అన్నారు. టీడీపీ, జనసేన గూండాలు బరితెగించి విచక్షణారహితంగా దాడికి పాల్పడడం దారుణమ‌ని ఆమె ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. 
`ఇలాంటి ఉన్మాద చర్యలను పోలీసులు చోద్యం చూసినట్లు చూస్తున్నారంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఇంకెక్కడ ఉన్నట్లు. ఒక జిల్లా ప్రధమ పౌరురాలికే పోలీసులు రక్షణ కల్పించలేకపోవడం దేశంలో మరెక్కడైనా జరుగుతుందా. చంద్రబాబు, లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడేం సమాధానం చెబుతారు. మహిళా హోంమంత్రి అనిత మీరెందుకు నోరు మెదపడం లేదు. కచ్చితంగా తగిన గుణపాఠం చెప్పే రోజు త్వరలోనే ఉంది` అని  ఉషాశ్రీచరణ్ హెచ్చ‌రించారు.

Back to Top