కర్నూలు: పేదల హృదయాల్లో స్థిరస్థాయిగా నిలిచిన మహానేత దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి అంటూ పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి కొనియాడారు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల హృదయాలలో స్థిరస్థాయిగా నిలిచిపోయారని మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ అన్నారు. మండల కేంద్రమైన తుగ్గలి లో మంగళవారం జరిగిన మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక వైయస్ఆర్సీపీ నాయకులు, వైయస్ఆర్సీపీ విభాగపు రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, వైయస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి మోహన్ రెడ్డి, వైయస్ఆర్సీపీ ఐటి విభాగపు నియోజకవర్గ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, మాజీ సింగల్ విండో అధ్యక్షురాలు విజయలక్ష్మి లు మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మకు ఘన స్వాగతం పలికి పూలమాలలతో సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శ్రీధవమ్మ వైయస్ఆర్సీపీ నాయకులతో కలిసి వైయస్ఆర్సీపీ సీనియర్ నేత స్వర్గీయ ప్రతాపరెడ్డి ఇంటి నుండి ర్యాలీగా వెళ్లి వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి పేద ప్రజల అభ్యున్నతికై అహర్నిశలు శ్రమించిన నేత అని ఆమె గుర్తు చేశారు. 2008-2009 మధ్య కాలంలో ఫీజురీయింబర్స్‌మెంట్ మొదలు పెట్టి ఆ పధకం ద్వారా పేద విద్యార్థులకు ఉన్నత చదువులు చేరువ చేసిన విద్యావేత్త అని,ఏప్రిల్ 1,2007 న ఆరోగ్య శ్రీ,పధకం ప్రారంభించి ఈ పధకం ద్వారా పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించిన డాక్టర్ అని,108 ను 2005 ఆగస్టు 15 న వైయస్ఆర్ ప్రారంభించారని, దీని ద్వారా ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా, అనుకోకుండా అశ్వస్తకు గురిఅయినా, గర్భిణీ స్త్రీ లకు ఉపయోగకరం అని భావించి ఆ పధకానికి రూపాకల్పన చేసిన ప్రాణదాత అని రైతన్నల కోసం జలయజ్ఞం ద్వారా 86 ప్రాజెక్టు లకు రూపకల్పన చేసి తన హయాంలోనే 26 ప్రాజెక్టు లను జాతికి అంకితం చేసి నీటిపారుదల చేయించిన రైతు బిడ్డ వైయస్ రాజశేఖరరెడ్డి అని అంతేకాక రైతులకు ఉచిత విధ్యుత్ అందించిన రైతు బాంధవుడు అని ఇది కాకుండా ఐటీ విభాగం లో కూడా అనేక సంస్థలను రప్పించి, విస్తరించిన ఘనత వైయస్ఆర్కే చెందుతుందని ఆమె అన్నారు. గ్రామిణ ప్రాంతాలకు ఇంటర్నెట్ వస్తుంది అంటే దాని వెనుక వైఎస్సార్ కృషి ఉందని, రాజీవ్ ఇంటర్నెట్ విలేజ్ ప్రాజెక్టు ద్వారా ఈ గవర్నన్స్ సేవలు అందించిన మేధావి అన్నారు. ఇలాంటి మహానేత కుమారుడు వైయస్ జగన్ ఆయన అడుగుజాడల్లోనే నడుస్తూ పేదల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని అన్నారు. అయితే నేడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి, ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఏ ఒకటి సక్రమంగా అమలు చేయలేదని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్సీపీ మండల కన్వీనర్ అట్లా గోపాల్ రెడ్డి, వైయస్ఆర్సీపీ నాయకులు ఎర్రగుడి రామచంద్రారెడ్డి, రాతన మోహన్ రెడ్డి, జగన్నాథ్ రెడ్డి, జిట్టా నగేష్ యాదవ్, జడ్పిటిసి పులికొండ నాయక్, నారాయణ నాయక్, ఎంపీపీ గౌరవ సలహాదారుడు హనుమంతు, వైస్ ఎంపీపీలు మల్లికార్జున్ రెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యులు చాంద్ బాషా, నాయకులు రామకొండ చంద్రశేఖర్ రెడ్డి, ఎద్దుల దొడ్డి, మారెళ్ళ రాజశేఖర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, ఎద్దుల దొడ్డి విజయ రెడ్డి, రంగనాథ్ రెడ్డి బొందిమడుగుల ఈశ్వర్ రెడ్డి, శభాష్ పురం రాఘవరెడ్డి, మధు యాదవ్, పగిడిరాయి బోడికొండ హనుమంతు, తుగ్గలి దేవరాజు, పురుషోత్తం, ముక్కెళ్ల గోవర్ధన్ రెడ్డి, లక్ష్మణ స్వామి, ఆనందు, బుల్లేని లక్ష్మణ్ స్వామి, గుడంపాటి రామనాయుడు, సురేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.