సంక్షేమ ప్ర‌దాత వైయ‌స్ఆర్‌

మాజీ మంత్రి తానేటి వ‌నిత‌

ఏలూరు జిల్లా:  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి సంక్షేమ ప్ర‌దాత అని మాజీ మంత్రి తానేటి వ‌నిత కొనియాడారు. ఇవాళ గోపాలపురం నియోజకవర్గం ద్వారక తిరుమల మండలం పంగిడి గూడెం గ్రామంలో డాక్ట‌ర్ వైయ‌స్ రాజశేఖర్ రెడ్డి గారి 16 వర్ధంతి సందర్భంగా రాష్ట్ర మాజీ హోం మంత్రి, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ మెంబర్ తానేటి వనిత మ‌హానేత విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. అనంత‌రం అన్న‌దాన కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.  ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ..`వైయ‌స్ఆర్ అనగానే గుర్తుకు వచ్చేది సంక్షేమ పథకాలు. వాటిని రాజకీయ ప్రత్యర్థులు ఎన్నికల తాయిలాలని విమర్శించారు. కానీ వైయ‌స్ఆర్‌ అమలు చేసిన ప్రతి సంక్షేమ పథకానికీ ఒక శాస్త్రీయ పరిశీలన, హేతుబద్ధమైన కారణం కనిపిస్తుంది. తాను ముఖ్యమంత్రి అయిన తరువాత రైతుల ఆత్మహత్యలకు కారణాలు, నివా రణ చర్యలు సిఫార్సు చెయ్యమని ‘ఆచార్య జయతీ ఘోష్‌ కమిషన్‌’ను నియమించారు. 

రైతుల ఆత్మహత్యలకు వ్యవసాయ సమస్యలే కారణం కాదనీ, విద్య, వైద్యం వంటివి కార్పొరేట్‌ల చేతుల లోకి వెళ్లడం వల్ల రైతులు మరిన్ని అప్పులు చేయవలసివచ్చి ఆత్మ హత్యలకు పాల్పడ్డారనీ కమిషన్‌ పేర్కొంది. దీంతో వైయ‌స్ఆర్‌ ‘ఫీజు రీయింబర్స్‌మెంట్‌’, ‘ఆరోగ్య శ్రీ’ పథకాలను ప్రవేశపెట్టారు.  వైయ‌స్ఆర్‌ తరహాలోనే జగన్‌మోహన్‌ రెడ్డి కూడా ‘రైతు భరోసా’, ‘అమ్మ ఒడి’, ‘నాడు–నేడు’ వంటి పథకాలు అమలు చేశారు. ఇవి చూడటానికి సంక్షేమ పథకాలు అనిపిస్తున్నా, ఈ పథ కాల వల్ల రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయి.

వైయ‌స్ఆర్‌ర్‌ ఐదు సంవత్సరాల (స్వల్ప కాలపు) పాలనలోనే అనేక దీర్ఘకాలిక ఆలోచనలు మనకు ప్రతి అంశంలోనూ కనిపి స్తాయి. భవిష్యత్తు మొత్తం నగరాల చుట్టూ ఉంటుందని నాడే ఆయన గుర్తించారు. గ్రేటర్‌ హైదరాబాద్, గ్రేటర్‌ విశాఖ, గుంటూరు – విజయవాడ, గ్రేటర్‌ వరంగల్, గ్రేటర్‌ తిరుపతి ఏర్పాటు ఆలోచన వైయ‌స్ఆర్‌దే! ` అని వ‌నిత తెలిపారు.  
 

Back to Top