ఉప్పాల హారికకు వైయ‌స్ జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌

ఫోన్ చేసి ఘ‌ట‌న వివ‌రాలు అడిగి తెలుసుకున్న వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌ 

 విజయవాడ: కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్ ఉప్పాల హారికను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. ఆమెతో మాట్లాడి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్న వైఎస్‌ జగన్‌.. బీసీ మహిళపై జరిగిన పాశవిక దాడిని ఆయన ఖండించారు. టీడీపీ, జనసేన మూకలు దాడి చేసిన విషయం పార్టీ నాయకులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. 

ఒక బీసీ మహిళ, జిల్లా ప్రథమ పౌరురాలు భయంతో వణికిపోయే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయంటే ఇంతకంటే దారుణం ఉంటుందా? అంటూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ప్రజాస్వామ్య హననం జరుగుతోందని, ఆటవిక పాలన సాగుతోందని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. హారిక ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసానిచ్చారు.

బీసీ మహిళ, జడ్పీ ఛైర్మన్ ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన గూండాల దాడికి పాల్పడ్డారు. ఆమె కారును చుట్టుముట్టి విచక్షణారహితంగా దాడికి దిగారు. వైయ‌స్ఆర్‌సీపీ సమావేశానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
 

Back to Top