కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు అక్రమం

ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌ ధ్వజం

వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్‌.

తాడేపల్లి:     వైయస్సార్‌సీపీలో బీసీలు లక్ష్యంగా వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్‌ ఫైర్‌ అయ్యారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు అక్రమమని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ధ్వజమెత్తారు. 
    రాజకీయంగా అణచివేసేందుకే కారుమూరిపై అక్రమ కేసులు బనాయించారని, కొన్నాళ్ల క్రితం ఆయన కుమారుడు కారుమూరి సునిల్‌ను అరెస్టు చేశారని, ఇప్పుడు ఏకంగా మాజీ మంత్రినే హైదరాబాద్‌లో అన్యాయంగా అరెస్టు చేశారని ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్‌ ఆక్షేపించారు. అసలు లేని సృష్టించి కారుమూరిని అరెస్టు చేయడం.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే బీసీలపై వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు కక్ష సాధింపునకు నిదర్శనమని చెప్పారు.
తమది బీసీల పార్టీ అని ఎన్నికల ముందు చెప్పిన సీఎం చంద్రబాబు, ఇప్పుడు అదే బీసీలను వెంట్రుక ముక్క అన్నట్టుగా తీసి పడేస్తున్నారని గుర్తు చేశారు. అయితే వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకు భయపడబోమని, అన్నీ గట్టిగా ఎదుర్కొంటామని ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్‌ తేల్చి చెప్పారు

Back to Top