రామచంద్రపురం: రామచంద్రపురం టౌన్ 11వ వార్డు పరిధిలోని బ్రాడీపేట, రెల్లిపేట, తోటవారి వీధుల్లో సోమవారం నిర్వహించిన గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ రామచంద్రపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్ పాల్గొని ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. స్థానిక ప్రజల సమస్యలు, వార్డు అవసరాలను అడిగి తెలుసుకున్నారు. తమ దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి వంతు కృషి చేస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ 11వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తామని పిల్లి సూర్యప్రకాష్ తెలిపారు. వార్డులోని మౌలిక వసతులు, స్థానిక అవసరాలపై ప్రజలతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులను గెలిపిస్తే 11వ వార్డు అభివృద్ధికి మరింత ప్రాధాన్యతనిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని సూర్యప్రకాష్ తెలిపారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు సానుకూలంగా స్పందించారు. ప్రతి ఇంటి వద్ద ప్రజలు తమ సమస్యలను సూర్యప్రకాష్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలతో మమేకమై సాగిన కార్యక్రమం ఉత్సాహభరితంగా కొనసాగింది. కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.