బీసీ మ‌హిళా ప్ర‌జాప్ర‌తినిధిపై దాడి అమానుషం

మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జిని 

ప‌ల్నాడు:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ మ‌హిళా, కృష్ణా జిల్లా జెడ్పీ ఛైర్‌పర్సన్‌ ఉప్పాల హారికపై దాడి అమానుష‌మ‌ని, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జిని అన్నారు. చంద్రబాబు ప్రజలకిచ్చిన వాగ్ధానాల అమలులో విఫలమై డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నాడని ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

`రెడ్‌ బుక్‌ రాజ్యాంగం పేరుతో వైయ‌స్ఆర్‌సీపీని టార్గెట్‌ చేశారు. సూపర్‌ సిక్స్‌ పథకాల ఊసు లేదు కానీ మా పార్టీ వారిని వందల మందిని జైలు పాలు చేస్తున్నారు. ఇంత దారుణమైన పాలన ఎన్నడూ చూడలేదు. ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశం కూటమి ప్రభుత్వానికి లేదు. కక్షసాధింపులు, వేధింపులు, దాడులు, దౌర్జన్యాలతో ఏడాది కాలం గడిపారు. వ్యక్తిగత కక్షలు, దాడులు, అరెస్ట్‌లు దారుణం. ప్రజలన్నీ గమనిస్తున్నారు, తగిన బుద్ది చెప్పే రోజు అతి త్వరలోనే ఉంది` అని విడదల రజిని హెచ్చ‌రించారు.

Back to Top