చంద్రబాబు మోసాల‌ను ఎండ‌గ‌డ‌దాం

అనంత‌పురం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు అనంత వెంక‌ట్రామిరెడ్డి

అనంత‌పురంలో `బాబు ష్యూరిటీ-మోసం గ్యారెంటీ` పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ‌

అనంత‌పురం:  చంద్ర‌బాబు కూట‌మి ప్ర‌భుత్వం ఏడాది కాలంలో ప్ర‌జ‌ల‌కు చేసిన మోసాల‌ను ఇంటింటా ఎండ‌గ‌డ‌దామ‌ని అనంత‌పురం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు అనంత వెంక‌ట్రామిరెడ్డి పిలుపునిచ్చారు. శుక్ర‌వారం అనంత‌పురం నగరంలోని యాపిల్ గార్డెన్స్‌లో "రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో` ..`బాబు ష్యూరిటీ-మోసం గ్యారెంటీ` పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా అనంత వెంక‌ట్రామిరెడ్డి మాట్లాడుతూ..  `రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని సీఎం చంద్రబాబు ఖూనీ చేస్తున్నారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో రైతుల సమస్యలను తెలుసుకోవడానికి వెళ్లిన మాజీ సీఎం, 40 శాతం ఓటింగ్‌ ఉన్న రాజకీయ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందింది. ఆయన పర్యటనను అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయి. రైతులపై పోలీసులు లాఠీఛార్జీ చేసి శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూశారు.  మామిడి, పొగాకు రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతుంటే అక్కడకు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెళ్లకుండా అడ్డుకుంటూ కూటమి ప్రభుత్వం నియంతలా వ్యవహరించింది. ఇదే కొనసాగితే ప్రభుత్వంపై, పోలీసులపై ప్రజలు తిరగబడే రోజు అతి త్వరలో వస్తుంది. వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంట లక్షలాది మంది కార్యకర్తలు, అభిమానులు, రైతులు, ప్రజలు నడవడానికి సిద్ధంగా ఉన్నారు` అని అనంత వెంక‌ట్రామిరెడ్డి పేర్కొన్నారు. కార్య‌క్ర‌మంలో అనంతపురం జిల్లా పార్టీ పరిశీలకులు పేరం నరేష్ కుమార్ రెడ్డి , నియోజ‌క‌వ‌ర్గ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

Back to Top