ఇంటింటా చంద్ర‌బాబు మోసం

కూట‌మి స‌ర్కార్ నిజ స్వ‌రూపం బ‌ట్ట‌బ‌య‌లు చేస్తున్న వైయ‌స్ఆర్‌సీపీ నేత భూమ‌న అభిన‌య్‌రెడ్డి

తిరుప‌తి:  ఎన్నిక‌ల స‌మ‌యంలో కూట‌మి నేత‌లు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమ‌లు చేయ‌కుండా మోసం చేస్తున్నారు. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అయిన త‌రువాత చేసిన‌ డ్రామాల‌ను వైయ‌స్ఆర్‌సీపీ నేత భూమ‌న అభిన‌య్‌రెడ్డి ఇంటింటి స‌ర్వే ద్వారా బ‌ట్ట‌బ‌య‌లు చేస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లు వినూత్న కార్య‌క్ర‌మాల ద్వారా కూట‌మి తీరును ఎండ‌గ‌ట్టిన అభిన‌య్‌రెడ్డి తాజాగా ఇంటింటా ప‌ర్య‌టించి ప్ర‌భుత్వ హామీల తీరుపై ఆరా తీస్తూ ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌వంతం చేస్తున్నారు. సోమ‌వారం తిరుప‌తి న‌గ‌రంలో ఆయ‌న ఇంటింటి స‌ర్వే చేప‌ట్టారు. ఇందులో చంద్ర‌బాబు చేసిన మోసాలు వెలుగు చూపాయి. వాటిని వీడియో రూపంలో సోష‌ల్ మీడియా ద్వారా అభిన‌య్‌రెడ్డి ప్ర‌చారం చేశారు.

చంద్రబాబు నాటకం:
 • ఓ ఇంటికి వెళ్లి, “మీకు అన్ని పథకాలు అందుతున్నాయా?” అని అడిగాడు.
 • వాళ్ళు వెంటనే అన్ని అందుతున్నాయి సర్ అంటూ సమాధానం. ఓ మహిళ ఒక అడుగు ముందుకు వేస్తూ “రెండో విడ‌త సిలిండర్ డబ్బు కూడా వచ్చింది” అనే మాటనే పెద్ద హంగామాగా చూపించారు.
 • ప్రజల కష్టాలు పక్కనబెట్టి, ఫోటో షూట్లు, పబ్లిసిటీకి మాత్రమే పరిమితమైన పర్యటన.

వాస్త‌వాలు వెలుగులోకి తెస్తున్న అభినయ్ రెడ్డి:
 • గడప గడప తిరిగి, ప్రజలతో నేరుగా మాట్లాడి నిజ పరిస్థితులు తెలుసుకుంటున్న భూమ‌న అభిన‌య్‌రెడ్డి.
 • స్పష్టంగా సూపర్ 6 అని హామీలిచ్చి ఇప్పటి వరకు ఏమీ ఇవ్వలేదు అని స్పష్టంగా చెప్పారు. “ఒకే ఒక్క సిలిండర్ వచ్చినా అది కూడా అందరికీ రాలేదు” అనే తీరా బహిర్గతమైంది.
 • హామీలతో మోసం, పథకాలతో ప్రహసనం – ఇదే కూటమి ప్రభుత్వ నిజ స్వరూపం.

 మాటలు, డ్రామాలు కాదు చంద్ర‌బాబు… ప్రజల కష్టాలు నిజంగా తెలుసుకోవాలి అంటూ భూమ‌న అభిన‌య్‌రెడ్డి డిమాండ్ చేశారు. 

Back to Top