డీజీపీ అపాయింట్‌మెంట్‌ కోరిన వైయస్ఆర్‌సీపీ

ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, వరుదు కళ్యాణి లేఖ‌

 
తాడేపల్లి: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని.. దాంతో పాటు, యథేచ్ఛగా సాగుతున్న పోలీసుల అక్రమ అరెస్టులు, వేధింపులపై వినతి పత్రం ఇచ్చేందుకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని రాష్ట్ర డీజీపీని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కోరింది. ఈ మేరకు వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, వరుదు కళ్యాణి రాసిన లేఖను పార్టీ ప్రతినిధులు డీజీపీ కార్యాలయంలో అందజేశారు.
    మాజీ మంత్రి విడదల రజనిపై సీఐ దౌర్జన్యంగా వ్యవహరించిన నేపథ్యంలో, రాష్ట్రంలో నానాటికీ దిగజారుతున్న శాంతి భద్రతలు, విపక్షంపై సాగుతున్న పోలీసులు వేధింపులు, అక్రమ అరెస్టులు.. ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకే ప్రమాదంగా మారుతున్నాయని వైయస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు ఆ లేఖలో ప్రస్తావించారు. ఇంకా అవన్నీ కచ్చితంగా పౌరుల హక్కులకు భంగం కలిగించడమే అన్న వారు, వీటన్నింటిపై వినతి పత్రం సమర్పించేందుకు డీజీపీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని తమ లేఖలో కోరారు.

Back to Top