మ‌హిళ‌ల వినూత్న నిర‌స‌న‌

తిరుప‌తిలో వైయ‌స్ఆర్‌సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన 

తిరుప‌తి: మాజీ మంత్రి, బీసీ నేత విడదల రజిని పట్ల చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బనాయుడు అనుచిత ప్ర‌వ‌ర్త‌ను నిర‌సిస్తూ తిరుప‌తిలో మ‌హిళ‌లు వినూత్న నిర‌స‌న చేప‌ట్టారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ ఏది...అంటూ మహిళలు రొడ్డెక్కారు.  తిరుప‌తి ఆర్టీసీ బస్టాండ్ కూడలిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నాయకురాళ్ళు నోటికి నల్ల రిబ్బన్ కట్టుకుని మౌన నిరసన తెలిపారు. మహిళలు, అందులోనూ బీసీ, దళిత మహిళలపై కూటమి ప్రభుత్వ వరుస దాష్టీకాలను ఖండిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. 

Back to Top