కోహ్లీ ఆట‌తీరు రాబోయే త‌రాల ఆట‌గాళ్ల‌కు స్ఫూర్తి

వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్‌

 తాడేప‌ల్లి: భారత క్రికెట్‌ చరిత్రలో అద్భుతమైన ఆటగాళ్లలో ఒకరైన విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలకడం హృదయవిదారకమైన విషయమ‌ని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. `కోహ్లీ ఆటను చూడడం ఎప్పుడూ ఆనందాన్ని ఇచ్చేది. ఆటపై ఉన్న అతనికి ఉన్న‌ అభిరుచి, స్థిరత,  విజ‌యం సాధించాలనే ఆకాంక్ష నేటి ఆట‌గాళ్ల‌కు ఆదర్శప్రాయం. కోహ్లీ రికార్డులు మాటల కంటే గొప్పగా మాట్లాడతాయి. ఆయన వారసత్వం రాబోయే తరాల ఆటగాళ్లకు ప్రేరణగా నిలుస్తుంది. తన భవిష్యత్ ప్రయాణంలో కోహ్లీకి అన్ని రంగాల్లో విజయం కలగాలని కోరుకుంటున్నా` అంటూ వైయ‌స్ జ‌గ‌న్ త‌న ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.

Back to Top