"వుయ్ "యాప్ పై పోలీసులు చర్యలు తీసుకోవాలి

ప్రకాశం:   తెలుగు దేశం పార్టీ తీసుకువ‌చ్చిన "వుయ్ "యాప్ పై పోలీసులు చర్యలు తీసుకోవాల‌ని ఒంగోలు వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే  అభ్యర్థి బాలినేని, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి డిమాండు చేశారు. ఆదివారం వారు ప్ర‌కాశం జిల్లా ఎస్పీని క‌లిసి ఫిర్యాదు చేశారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. ఒంగోలులో రేపు జరిగే పోలింగ్ సజావుగా జరగకుండా టిడిపి కుట్ర పన్నుతోంద‌ని పేర్కొన్నారు. టిడిపి గొడవలకు ప్లాన్ చేస్తోంది
మాకున్న సమాచారంతో  ఎస్పీకి ఫిర్యాదు చేశామ‌న్నారు. రేపు పోలింగ్ ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నామ‌న్నారు. టిడిపి వాళ్ళు"వుయ్" యాప్ లో ఓటర్ల డేటా తీసుకొని.. మహిళాలకు భద్రత లేకుండా చేస్తున్నార‌ని చెప్పారు. "వుయ్ "యాప్ పై పోలీసులు చర్యలు తీసుకోవాల‌ని వారు కోరారు.

Back to Top