మైనార్టీ రిజర్వేషన్ల రద్దుకే చంద్రబాబు - పవన్ ఓటు! 

వైయ‌స్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే మహ్మద్‌ అబ్దుల్‌ హఫీజ్‌ఖాన్  

మైనార్టీలపై చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లది కపటప్రేమ

బీజేపీ మెప్పుకోసం ఎంతకైనా తెగించే ఊసరవెల్లి రాజకీయం వారిది..

4 శాతం రిజర్వేషన్లపై ముస్లీంలకు అండగా జగన్‌గారు

మట్టి బుర్రతో పవన్ ముస్లింలకు రిజర్వేషన్లు అవసంలేదు అంటున్నాడు

మైనార్టీల సంక్షేమానికి జగన్‌ గారు రూ.23 వేల కోట్లు ఖర్చుపెట్టారు

2024 ఎన్నికల్లో వైయ‌స్ జగన్ మళ్లీ సీఎం కావాలని  ముస్లీంలు కోరుతున్నారు: ఎమ్మెల్యే  హఫీజ్‌ఖాన్‌

తాడేప‌ల్లి:  మైనార్టీ రిజర్వేషన్ల రద్దుకే చంద్రబాబు, పవన్ మ‌ద్ద‌తిస్తున్నార‌ని వైయ‌స్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే మహ్మద్‌ అబ్దుల్‌ హఫీజ్‌ఖాన్ పేర్కొన్నారు. మతాలకు సంబంధం లేకుండా అన్ని కులాల్లోనూ వెనుకబడిన వర్గాలుంటారు. కనుక, ముస్లీం మైనార్టీల్లోనూ అభివృద్ధి లేక, అణగారిని కుటుంబాలున్నాయని.. వారికి కల్పించే 4 శాతం రిజర్వేషన్‌ను మతం ఆధారంగా చూడకూడదన్నారు. అవకాశాలకు నోచుకోకుండా.. అన్ని రంగాల్లోనూ అట్టడుగుస్థాయిలో ఉన్న ముస్లీంలను పైకి తేవాలనే లక్ష్యంతోనే లాజికల్‌గా, లీగల్‌గా, రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్‌ను కొనసాగిస్తామని జగన్‌ గారు వివరించారు. ఈ విషయంలో ఎన్‌డీఏ కూటమి తరఫున ఎవరు ఏం మాట్లాడినా.. నేను మీ పక్కన అండగా నిలబడి మాట్లాడుతానన్న దమ్మున్న నాయకుడు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి గారు. అప్పుడు ఆయన మాటలు ప్రతీ ముస్లీం సోదరుడి గుండెల్లో నిలిచిపోయాయ‌ని చెప్పారు.  శ‌నివారం హ‌ఫీజ్ ఖాన్ తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడారు. 

ముస్లీంలకు చంద్రబాబు చేసిందేమీలేదుః
ఈరోజుతో ఎన్నికల ప్రచారం ముగుస్తోంది. ఇన్ని రోజులూ రాజకీయ పార్టీలు ఇంటింటికీ తిరిగి మా పార్టీకి ఓట్లేయండని అందరూ తిరిగారు. గతంలో వారు చేసిన మంచి పనులను చెప్పుకుంటూ ప్రజల్ని ఓట్లడిగారు. కానీ, ఎన్‌డీఏ కూటమిలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ మాత్రం 2014 నుంచి 2019 వరకు ఏం చేసిందీ చెప్పుకునే పరిస్థితి లేదు. ఒకట్రెండు చోట్ల ప్రజలు కూడా ఆయాపార్టీల నేతల్ని గతంలో మీరేం చేశారో చెప్పండని నిలదీసిన పరిస్థితినీ చూశాం. మరీ, ముఖ్యంగా మా ముస్లీం మైనార్టీలు చంద్రబాబును నిలదీసినప్పుడు కూటమి తరఫున ఆయన సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలోకెళ్లాడ‌ని తెలిపారు.

ముస్లీంలు వృద్ధిలోకి రాకూడదనేది చంద్రబాబు భావజాలంః
మైనార్టీలను అభివృద్థి పథంలో నడిపించేందుకు మీరేం చేశారయ్యా అని చంద్రబాబును నిలదీస్తే.. ఒక్క రంజాన్‌ తోఫా గురించి చెప్పుకుంటున్నా డు. అంటే, ఏడాదికోసారి రంజాన్‌ పండుగనాడు పుచ్చిపోయిన సరుకులు ఒకట్రెండు అందిస్తే వాటితో సరిపుచ్చుకోవాలని అంటున్నాడా..? ముస్లీం మైనార్టీలు విద్య, వైద్యం, ఆర్థికం, సామాజికం, రాజకీయంగా, మహిళా సాధికారతపరంగా ఎదగకూడదనేది చంద్రబాబు భావజాలంగా కనిపిస్తోంది.    

4 శాతం రిజర్వేషన్లపై ముస్లీంలకు అండగా జగన్‌గారుః
నెల్లూరులో మొన్న మా పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ముస్లీంలకు 4 శాతం రిజర్వేషన్‌ అమలు విషయంలో స్పష్టతనిచ్చారు. మతాలకు సంబంధం లేకుండా అన్ని కులాల్లోనూ వెనుకబడిన వర్గాలుంటారు. కనుక, ముస్లీం మైనార్టీల్లోనూ అభివృద్ధి లేక, అణగారిని కుటుంబాలున్నాయని.. వారికి కల్పించే 4 శాతం రిజర్వేషన్‌ను మతం ఆధారంగా చూడకూడదన్నారు. అవకాశాలకు నోచుకోకుండా.. అన్ని రంగాల్లోనూ అట్టడుగుస్థాయిలో ఉన్న ముస్లీంలను పైకి తేవాలనే లక్ష్యంతోనే లాజికల్‌గా, లీగల్‌గా, రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్‌ను కొనసాగిస్తామని జగన్‌ గారు వివరించారు. ఈ విషయంలో ఎన్‌డీఏ కూటమి తరఫున ఎవరు ఏం మాట్లాడినా.. నేను మీ పక్కన అండగా నిలబడి మాట్లాడుతానన్న దమ్మున్న నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి గారు. అప్పుడు ఆయన మాటలు ప్రతీ ముస్లీం సోదరుడి గుండెల్లో నిలిచిపోయాయి. 

పవన్‌కళ్యాణ్‌.. మా గురించి ఏం తెలుసని రిజర్వేషన్లు వద్దంటున్నావ్‌..?ః
ఎన్‌డీఏ కూటమి తరఫున రాజ్‌నాథ్‌సింగ్‌ విశాఖపట్టణం వచ్చి మాట్లాడుతూ.. ముస్లీంలకు 4 శాతం రిజర్వేషన్‌ తీసేస్తామన్నారు. పవన్‌కళ్యాణ్‌ తన ప్రసంగాల్లో 2 లక్షల పుస్తకాలు చదివానని గొప్పగా  చెప్పుకుంటాడే..మరి, ముస్లీంలకు సంబంధించి రంగనాథ్‌మిశ్రా కమిషన్, సహచార్‌ కమిషన్‌లు ఏం చెప్పాయో చదవలేదా..? మైనార్టీలు ఎలా బతుకుతున్నారో మీకు తెలుసా..? ముస్లీంలు అనుభవిస్తున్న పేదరికం మీరెప్పుడైనా చూశారా..? మా ఆర్థికస్థితిగతులు, మా బిడ్డల జీవనప్రమాణాలు మీకు తెలుసా..? మీరెప్పుడైనా ముస్లీం కాలనీల్లో గల్లీల్లో తిరిగి .. మా కుటుంబాలు ఏఏ పనులు చేస్తారో.. ఎంత సంపాదిస్తారో చూశారా..? మా భవిష్యత్తేంటి..? మమ్మల్ని మెయిన్‌స్ట్రీమ్‌లోకి ఎలా తీసుకురావాల్నో.. అనే విషయాలపై మీరు ఏరోజైనా ఆలోచన చేశారా..? మీకు ఏమీ తెలియదు. కానీ, నిరంతరం బీజేపీ జపం చేసే నువ్వు ముస్లీంలకు రిజర్వేషన్లు అవసరం లేదంటావా..? నీకు సిగ్గుండాలి.

ముస్లీంల పాలిట వైఎస్‌ఆర్‌ గారు దేవుడుః
ముస్లీంలకు రిజర్వేషన్లు కల్పించాలని చంద్రబాబు అధికారంలో ఉండగా మేమెన్నో పోరాటాలు చేశాం. అప్పట్లో ఆయన మామీద కరుణ చూపకపోగా ముస్లీంలను అనేక సందర్భాల్లో చిన్నబుచ్చి అవమానాలకు గురి చేశాడు. కానీ, మహానేత దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గారు మాత్రం పాదయాత్ర ద్వారా మా ముస్లీం కాలనీల్లో గల్లీగల్లీ తిరిగి మా ఇళ్లూ వాకిళ్ళూ చూసి.., మా బిడ్డల బతుకును, మేము చేసే చిన్న చిన్న పనుల్ని చూసి చలించిపోయారు. అరాకొరా సంపాదనతో అష్టకష్టాలు పడే మా బతుకుల గురించి ఆలకించాక.. మా బతుకుల్ని కళ్ళారా చూశాకే ముస్లీంలకు 4 శాతం రిజర్వేషన్లు ఉండాలని ప్రకటించిన మహాను భావుడు వైఎస్‌ఆర్‌గారు. 

మట్టిబుర్రతో మాట్లాడటం తగునా పవన్‌కళ్యాణ్‌..?ః
ఇన్ని పోరాటాలతో తెచ్చుకున్న రిజర్వేషన్లను బీజేపీ ఉంచినా.. తొలగించినా మాకు సమ్మతమేనని చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతున్నారంటే.. వారెంత దౌర్భాగ్యులో అర్ధం చేసుకోవాలి. రాజకీయాల మీద అవగాహన తోనే.. సబ్జెక్టు పట్ల చిత్తశుద్ధితో ఆలోచించి మాట్లాడాలి గానీ.. ఏమీలేని మట్టిబుర్రతో బీజేపీ ఎలా చేస్తే అలా మంచిదని పవన్‌కళ్యాణ్‌ మాట్లాడటం చాలా సిగ్గుచేటు. అంటే, నువ్వు బీజేపీ జపం చేసినంత మాత్రాన, ముస్లీంలకు 4 శాతం రిజర్వేషన్‌లను రద్దు చేయమనడం న్యాయమా..? 

మీ ఊసరవెల్లి రాజకీయాన్ని నమ్మేప్రసక్తేలేదుః
ఎన్‌డీఏ సభల్లో బీజేపీ నేతలు ఎన్‌ఆర్‌సీని అమల్లోకి తెస్తామని, యూనిఫాం సివిల్‌కోడ్‌ పెడతామంటూ ప్రతీ రాష్ట్రంలోనూ చెబుతున్నారు. ముస్లీంలు ధరించే బురఖా, టోపీ, మసీదు నుంచి ప్రతీదానిపై కూడా అవమానిస్తామని.. ఆటంకాలు సృష్టిస్తామని.. మాలో అభద్రతావం తీసకొచ్చే విధంగా బెదిరిస్తున్నారు. ముస్లీం సామాజికవర్గాన్ని పూర్తిగా సమాజం నుంచి వెలివేసే దిశగా, కులాలు, మతాల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. అలాంటి ఎన్‌డీఏ కూటమి సభ్యుడిగా చంద్రబాబు మాత్రం టోపీ ధరించి నలుగురు పెయిడ్‌ ఆర్టిస్టుల్ని పెట్టుకుని నేను మీ సామాజికవర్గానికి మేలు చేస్తానంటే .. అలాంటి వ్యక్తుల నోటిమాటలు విని, మీ ఊసరవెల్లి రాజకీయం నమ్మేందుకు ముస్లీంలెవరూ సిద్ధంగా లేరు. 

 రిజర్వేషన్లను రద్దు చేయబోమని బీజేపీతో అనిపించే దమ్ముందా.?ః
అయ్యా చంద్రబాబూ.. నువ్వు ముస్లీంలకు ఇప్పటివరకూ చేసిన అన్యాయాలు చాలు. ఇంకా, నీ కల్లబొల్లి కబుర్లు వినేందుకు ఇక్కడెవరూ సిద్ధంగా లేరని తెలుసుకో.. మా మీద నీకు నిజంగా ప్రేమ ఉన్నటైతే ముస్లీంల రిజర్వేషన్‌ను రద్దు చేయబోమని మోడీతో చెప్పించకుండా ఇన్నాళ్లూ ఏం చేశావు..? ముస్లీంలనూ పదేపదే ఎందుకు అవమానిస్తున్నారు. వారి రిజర్వేషన్లూ ఎందుకు తీసేస్తామంటున్నారని చెప్పి కూటమి నుంచి బయటకు రాలేవా..? అంటే, ఒకవైపు నీకు ఎన్‌డీఏ కూటమి కావాలి. మరోవైపు ప్రజల ఓట్లు నీకే కావాల్నా..? మరీ, ఇంత రాజకీయ స్వార్థం అవసరమా నీకు..? మా భావితరాల భవిష్యత్తును అణచివేయడానికి చంద్రబాబు కుట్ర చేస్తున్నాడు. 

మైనార్టీల మేలుకు జగన్‌గారు రూ.23 వేల కోట్లు ఖర్చుపెట్టారుః
2014 నుంచి 2019 వరకు నువ్వు అధికారంలో ఉండి కూడా బీజేపీ మెప్పుపొందేందుకే ఒక్క మైనార్టీకి ఎమ్మెల్సీ ఇవ్వకుండా, మైనార్టీ లకు మంత్రి పదవి కూడా ఇవ్వలేదుకదా..? నీ కొడుకు లోకేశ్‌కు, నారాయణలకు ఎమ్మెల్సీ లు పదవులిచ్చి మంత్రి పదవులు కట్టబెట్టావు. మరి, ఏ మైనార్టీ వ్యక్తికి మంత్రి పదవి ఎందుకివ్వలేదు..? మైనార్టీల సంక్షేమానికి నువ్వేం చేశావు.? అదే మా జగన్‌ గారు ముస్లీంల అభివృద్ధికి దాదాపు రూ.23 వేల కోట్లు ఖర్చుపెట్టారు. ఉర్దూను సెకండ్‌ లాంగ్వేజీ చేశారు. మైనార్టీలకు సబ్‌ప్లాన్‌ పెట్టారు. 

బతికినంతకాలం పేదలుగా ఉండాలనేది చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ల కోరికః
ఇవాళ 175 అసెంబ్లీ స్థానాల్లో 4 శాతం రిజర్వేషన్‌ ప్రకారం 7 మందికి ఎమ్మెల్యే సీట్లు కూడా ఇచ్చారు. మరి, నువ్వు కేవలం 3 సీట్లకే ఎందుకు పరిమితం అయ్యావు..? పవన్‌కళ్యాణ్‌ అభిమానుల్లో ముస్లీంలెవరూ లేరా..? మరి, ఒక్క సీటైనా ముస్లీంలకు ఎందుకు ఇవ్వలేదు..? అంటే, మా ఓట్లు కావాలి. మేమూ కావాలి గానీ.. మాకు మేలు చేసే విషయంలో కరివేపాకులా తీసిపడేస్తారా..? మేము బతికున్నంత కాలం కూలినాలీ పనులతో పేదలుగానే మిగలాలని మీరు కోరుకుంటున్నారనేది ముస్లీంలకు అర్ధమైంది. 

మళ్ళీ జగన్‌గారే సీఎం అవ్వాలనేది ముస్లీంల కోరికః
కాంగ్రెస్‌ పార్టీ కూడా ఇవాళ చంద్రబాబు డైరెక్షన్‌లోనే పనిచేస్తోంది. ముస్లీంలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధిలోకి రావాలంటే మాకు శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా మళ్లీ రావాల్సిందే. ముస్లీంలకు రిజర్వేషన్లతో పాటు హక్కులకు భద్రత ఉండాలంటే ఖచ్చితంగా వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం రావాల్సిందేనని ప్రతీ ఒక్కరూ కోరుకుంటున్నారు. ఎన్‌డీఏ కూటమి నేతలైన చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు ఎన్ని కల్లబొల్లి కబుర్లు చెప్పినా నమ్మేందుకు ముస్లీం సోదరులెవరూ సిద్ధంగా లేరని మరోసారి స్పష్టం చేస్తున్నాను. 

Back to Top