ఆంద్రప్రదేశ్ పప్పు లోకేష్.. ఇండియా  పప్పు రాహుల్ గాంధీ 

 వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్  

తాడేప‌ల్లి: ఆంద్రప్రదేశ్ పప్పు లోకేష్ అయితే భారత దేశ పప్పు రాహుల్ గాంధీ అంటూ  వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్  ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీని,ఏపీ కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నాదివంగత వైయస్ రాజశేఖరరెడ్డి పేరు ఎఫ్ ఐ ఆర్ పేరులో చేర్చింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్ర‌శ్నించారు. శ‌నివారం నాగార్జున యాద‌వ్ మీడియాతో మాట్లాడారు.వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి నివాళులు అర్పించే అర్హత రాహుల్ గాంధీకి లేదన్నారు. మహా నేత పేదలకోసం ప్రవేశపెట్టిన పథకాలను కాంగ్రెస్ రద్దు చేసింది. వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీని బీజేపీకి బి టీం అనడానికి సిగ్గు ఉందా అని ప్ర‌శ్నించారు.  కాంగ్రెస్ ఎంపీ పదవిని వదులుకొని...కాంగ్రెస్ అరాచకాలను,వేధింపులను ధైర్యంగా ఎదుర్కొని సొంతంగా పార్టీ స్దాపించి సీఎం అయిన గొప్ప నాయకుడు జగన్. దేశంలోనే 4 వ పెద్దపార్టీగా వైయస్సార్ కాంగ్రెస్ ను బలోపేతం చేసి శక్తివంతమైన పార్టీగా నిలిపారు.రాహుల్ గాంధీ ముక్కు నేలకు రాసినా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కు,వైయస్ రాజశేఖరరెడ్డివిషయంలో చేసిన తప్పు పోదు.వైయస్సార్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ తీరని ద్రోహం చేసింద‌ని మండిప‌డ్డారు.

Back to Top