కూటమి పాలనలో ఉపాధి కూలీలకు ఘోర అన్యాయం

కేంద్రంపై ఒత్తిడి తేవడంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పూర్తిగా విఫలం 
  
ఉపాధి కూలీ ధరల పెంపుదలలో ఏపీకి తీరని అన్యాయం

కూటమి ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ మంత్రి బూడి ముత్యాలనాయుడు, మాజీ ఎంపీ తలారి రంగయ్య. 

విశాఖపట్నం, అనంతపురం లోని వైయస్సార్సీపీ కార్యాలయాల్లో వేర్వేరుగా మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి

 బూడి ముత్యాలనాయడు, మాజీ ఎంపీ తలారి రంగయ్య. 

రాష్ట్రంలో ఉపాధి కూలీల పొట్టకొడుతుంటే చంద్రబాబు ఎందుకు నోరెత్తడం లేదు?"

 స్వప్రయోజనాల కోసమే చంద్రబాబు అధికారం 

 ఉపాధి కూలీలను, స్టీల్ ప్లాంట్ ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టారు

 ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి బూడి ముత్యాల నాయుడు 

 సినిమా టికెట్లు, పులులపై ఉన్న శ్రద్ధ.. పేద కూలీల ఉపాధిపై లేదా?

 కూటమి 'త్రిపుల్ ఇంజన్' సర్కార్‌లో 18 లక్షల ఉపాధి కార్డుల అక్రమ తొలగింపు

 ఏపీలో ఉపాధి కూలీలకు కేవలం రూ.5 పెంపు

 అయినా నోరు మెదపని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు

 వైయస్సార్సీపీ మాజీ ఎంపీ తలారి రంగయ్య ఫైర్

 

విశాఖపట్నం, అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను గాలికొదిలేసి, రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా పణంగా పెట్టిందని వైయస్సార్సీపీ తీవ్రస్థాయిలో మండిపడింది. విశాఖపట్నం, అనంతపురం పార్టీ కార్యాలయాల్లో వేర్వేరుగా జరిగిన మీడియా సమావేశాల్లో మాజీ మంత్రి బూడి ముత్యాలనాయుడు, మాజీ ఎంపీ తలారి రంగయ్యలు మాట్లాడుతూ.. దేశంలోని మిగతా రాష్ట్రాల్లో ఉపాధి హామీ కూలీ రేట్లను భారీగా పెంచినప్పటికీ, ఏపీలో మాత్రం కేంద్రం కేవలం రూ.5 మాత్రమే పెంచి పేద కూలీల పొట్టకొట్టిందని ధ్వజమెత్తారు. కేంద్రంలో చక్రం తిప్పగల సామర్థ్యం ఉండి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిఫ్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కరువు జిల్లాల ప్రజలకు జరుగుతున్న ఈ అన్యాయంపై నోరెత్తకపోవడం దారుణమన్నారు. కేవలం రాజకీయ కక్షలతోనే రాష్ట్రంలో 18 లక్షల ఉపాధి జాబ్ కార్డులను అక్రమంగా తొలగించారని ఆరోపించిన వైయస్సార్సీపీ నేతలు, తక్షణమే ఇతర రాష్ట్రాల తరహాలో ఏపీలోనూ కూలీ రేట్లను పెంచేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పేద కూలీలు, రైతుల తరపున రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరేమన్నారంటే... 

● బూడి. ముత్యాలనాయుడు, మాజీ మంత్రి. 

- ఉపాధి కూలీ రేట్లలో తీవ్ర వ్యత్యాసం – ఏపీకి గుండుసున్నా.

దేశంలోని 9 రాష్ట్రాల్లో ఉపాధి హామీ కూలీ రేట్లను రూ.44 నుంచి రూ.66 వరకు పెంచగా, హిమాచల్ ప్రదేశ్‌లో అత్యధికంగా రూ.66 పెంచారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు వంటి పొరుగు రాష్ట్రాల్లో కూడా కూలీ రేట్లు మనకంటే చాలా ఎక్కువగా ఉన్నాయి.కానీ, కేంద్రంలో కీలక భాగస్వామిగా  చంద్రబాబు నాయుడు ఉన్నా.. మన రాష్ట్రానికి వచ్చేసరికి కేవలం రూ.5 మాత్రమే పెంచినా స్పందించకపోవడం దారుణం. ఇది అత్యంత దయనీయమైన పరిస్థితి. వైయస్. జగన్ హయాంలో రూ.211 గా ఉన్న కూలీని ఐదేళ్లలో రూ.89 పెంచి రూ.300 కి చేరిస్తే.. కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ రెండేళ్లలో కేవలం రూ.12 మాత్రమే పెరిగింది. 

- చంద్రబాబు స్వప్రయోజనాల కోసమే అధికారం..

"నిత్యం ప్రధాని మోదీని కీర్తించే చంద్రబాబు... కూటమిలో అత్యధిక ఎంపీలున్నా మన రాష్ట్ర కూలీల గురించి ఎందుకు నోరెత్తడం లేదు?".వేరే రాష్ట్రాల్లో గరిష్టంగా రూ.401 ఇస్తుంటే, మన ఏపీలోని 47 లక్షల కుటుంబాలకు ఆ హక్కు ఎందుకు దక్కడం లేదు. చంద్రబాబు కేవలం తన స్వప్రయోజనాల కోసమే అధికారాన్ని వాడుకుంటూ రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా పణంగా పెట్టారు.

- విశాఖ రైల్వేజోన్, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మౌనం.

కేంద్రం నుండి ఎన్నో సాధించామని డబ్బా కొట్టుకుంటున్న కూటమి నేతలు రాష్ట్రానికి తెచ్చిన కొత్త ప్రాజెక్టు ఒక్కటైనా ఉందా?  విశాఖ రైల్వేజోన్‌కు కీలక ఆదాయ వనరుగా ఉన్న 'కే కే లైన్' వేరే జోన్‌కు తరలిపోతుంటే ఎందుకు మాట్లాడటం లేదు. గతంలో వైయస్.జగన్ సీఎంగా ఉన్నప్పుడు ప్రధాని మోదీ ముందే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకించారు.అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు.. కానీ నేడు చంద్రబాబు ఈ విషయంపై మోదీ దగ్గర మాట్లాడటానికి భయపడుతున్నారు. 

- అబద్ధాల 'సూపర్ సిక్స్' – సాగు రంగం నిర్లక్ష్యం..

కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలన్నింటినీ తుంగలో తొక్కింది. 50 ఏళ్లు దాటిన బీసీలకు పెన్షన్ ఇస్తామని చెప్పి రెండేళ్లయినా ఒక్కరికీ ఇవ్వలేదు సరికదా, ఉన్న పెన్షన్లలో కోతలు పెట్టారు.  
18 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు రూ.1500 (ఏడాదికి రూ.18,000) పథకం ఊసే లేదు.
నిరుద్యోగ భృతి రూ.3,000 ఊసే ఎత్తడం లేదు. దేశంలో ఎక్కడైనా చదరపు అడుగు నిర్మాణానికి రూ.5-6వేలు ఖర్చయితే..  అమరావతిలో మాత్రం చదరపు అడుగుకి రూ.15-20 వేలు ఖర్చు చూపిస్తూ భారీ దోపిడీకి పాల్పడుతున్నారు. రైతు భరోసా కేంద్రాలను (RBK) గాలికొదిలేశారు, కనీసం బస్తా యూరియా కూడా అందించలేని అసమర్థ స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. వైయస్.జగన్ హయాంలో విత్తనం నుంచి విక్రయం వరకు ఆర్బీకేల ద్వారా రైతులను చేయందించడం తో పాటు, ఎరువులు, విత్తనాలు గ్రామాల్లోనే అందించారు. కానీ నేడు అన్నదాత కూటమి పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాడు. ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదు. 

ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు, ఉపాధి హామీ కూలీలను ఇతర రాష్ట్రాల తరహాలో పెంచేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చే వరకు వైయస్సార్సీపీ ప్రజల తరపున రాజీలేని పోరాటం చేస్తుందని మాజీ మంత్రి బూడి ముత్యాలనాయుడు హెచ్చరించారు.

● తలారి రంగయ్య, మాజీ ఎంపీ. 

- ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై ఉన్న శ్రద్ధ.. కూలీల పొట్ట నింపడంపై లేదు.

ఉపాధి హామీ పథకానికి పురిటిగడ్డ అయిన అనంతపురం లాంటి వెనుకబడిన ప్రాంతాల రైతు కూలీలకు కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోంది. 
కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును 'విబిజీ రామ్ జీ' (వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్ అజీవక మిషన్ - గ్రామీణ) గా మార్చడంపై ఉన్న శ్రద్ధ, కూలీల రేట్లు పెంచడంపై లేదు.జాతీయ సగటు ఉపాధి కూలీ రేటు రూ.327.40 ఉంటే, మన రాష్ట్రంలో మాత్రం కేవలం రూ.308 నుండి రూ.312 మాత్రమే ఇస్తున్నారని, తెలంగాణలో రూ.1, ఏపీలో రూ.5 మాత్రమే పెంచడం దారుణం. హర్యానా, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో రూ.400 నుంచి రూ.450 పైగా ఇస్తున్నారు.

- ' 18 లక్షల కార్డుల తొలగింపు!

ఆంధ్రప్రదేశ్‌లో నడుస్తున్నది త్రిపుల్ ఇంజన్ (టీడీపీ, బీజీపీ, జనసేన) సర్కార్.. కానీ ఆ మూడు ఇంజన్లు కలిసి పేద కూలీల పొట్ట కొడుతున్నాయి. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్, రాష్ట్రంలో అదే శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రిగా పెమ్మసాని ఉన్నప్పటికీ రాష్ట్రానికి జరిగిందేమీ లేదన్నారు. రాజకీయ కక్షలతో రాష్ట్రంలో ఉన్న 47 లక్షల జాబ్ కార్డుల్లో ఏకంగా 18 లక్షల కార్డులను కూటమి ప్రభుత్వం అక్రమంగా తొలగించింది.

- సినిమా టికెట్లు, పులులపై ఉన్న శ్రద్ధ.. ఉపాధి హామీపై ఎందుకు లేదు పవన్ కళ్యాణ్?

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై.. తన శాఖపై సమీక్షలు చేయడం కంటే వైయస్సార్సీపీ నేతలను తిట్టడానికే సమయం వాడుకుంటున్నారు. సినిమా టికెట్ల రేట్ల పెంపు మీటింగులు, పక్క రాష్ట్రాల నుండి ఏనుగులు తేవడం, మహారాష్ట్ర సీఎంను పులులు అడగడంపై ఉన్న శ్రద్ధ.. కోట్లాది మంది పేదలకు సంబంధించిన ఉపాధి హామీ పథకంపై ఎందుకు లేదు?. చక్రాలు తిప్పగల సామర్థ్యం ఉందని చెప్పుకునే కూటమి నేతలు ఏపీ కూలీలకు జరుగుతున్న అన్యాయంపై ఎందుకు మౌనంగా ఉన్నారు.

- కరువు జిల్లాలకు తీరని అన్యాయం – లాయ్ రావణ్ అరెస్ట్ దుర్మార్గం.

అనంతపురం, కర్నూలు పశ్చిమ ప్రాంతం, ఉత్తరాంధ్రా, ప్రకాశం జిల్లాలు కరువు ప్రాంతాలని, ఇక్కడి ప్రజలు వలసలు పోకుండా కాపాడాల్సిన  బాధ్యత కూటమి ప్రభుత్వానిదే. ఈ నేపధ్యంలో  ఉపాధి హామీ కూలీని పెంచాల్సిందే. దీనిపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌కు లేఖ రాస్తాను.  అలాగే, అధికారంలోకి వస్తే గుంతలు పూడుస్తామని చెప్పి, రెండేళ్లయినా కూటమి సర్కారు, పవన్ కళ్యాణ్ ఎందుకు పట్టించుకోవడం లేదు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెప్పే పవన్ కళ్యాణప్రశ్నించిన జర్నలిస్ట్ 'ప్రశ్న రావణ్'ను అక్రమంగా అరెస్ట్ చేయడం దుర్మార్గం. రాష్ట్రంలో కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే ప్రశ్నించాలా? సామాన్యులకు, జర్నలిస్టులకు ఆ హక్కు లేదా? ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఏపీలోని ఉపాధి హామీ కూలీ మిగిలిన రాష్ట్రాల తరహాలో వచ్చేలా.. కేంద్రంపై  ఒత్తడి తేవాలి. లేని పక్షంలో ఉపాధి హామీ కూలీలకు న్యాయం జరిగే వరకు వైయస్సార్సీపీ తరపున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని తలారి రంగయ్య హెచ్చరించారు.
 

Back to Top