‘ఎస్ఐఆర్' ప్రక్రియలో తీవ్ర లోపాలు

గడువు మరో నెల రోజులు పొడిగించండి

సీఈఓకు వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి లేఖ

 తాడేప‌ల్లి: రాష్ట్రంలో ప్రస్తుతం జరుగు తున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (ఎస్ఐఆర్)లో తాజాగా వెలుగుచూసిన కొన్ని తీవ్ర లోపాలపై తక్షణం జోక్యం చేసుకోవాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ను కోరుతూ గురువారం లేఖ రాశారు. అలాగే సీఈవోకు రాసిన లేఖ ప్రతిని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి (చీఫ్ ఎలక్షన్ కమిషనర్)కు కూడా పంపారు.
లేఖలోని ప్రధానాంశాలు
→ రాష్ట్రవ్యాప్తంగా అనేక అసెంబ్లీ నియోజకవర్గాల

బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్ ఓ) ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశామని చెప్తున్నప్పటికీ, వాస్తవానికి సంబంధిత ఓటర్లు వాటిని అందుకో లేదన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతు న్నాయి. ప్రతి ఓటరుకి ఎన్యూమరేషన్ ఫారాన్ని వ్యక్తిగతంగా అందించడం, తద్వారా వారి వివరాలను పరిశీలించి అవసరమైన సవర ణలు చేసుకునే అవకాశం కల్పించడం బీఎ ప్రాథమిక విధి
→ అసాధారణంగా అధిక పంపిణీ శాతం నమోదు అయిన నియోజకవర్గాల్లో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీపై ర్యాండమ్గా ధ్రువీకరణ చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారులు (డీఈఓ), ఎన్నికల నమోదు అధికారులు (ఈఆ ర్ఓ)కు తక్షణ ఆదేశాలు ఇవ్వాలని కోరుతు
న్నాం. అలాగే తప్పుడు నివేదికలు చేసిన ఫీల్డ్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
4.16 కోట్లకు పైగా ఓటర్లలో కేవలం 1,28,62,948 ఫారాలే డిజిటలైజ్ చేశారు. అం టే మొత్తం ఓటర్లలో కేవలం 30.90 శాతం మాత్రమే. కొన్ని నియోజకవర్గాల్లో డిజిటలైజే షన్ ఐదో వంతు కూడా పూర్తి కాలేదు. కాబట్టి, అన్ని నియోజకవర్గాల్లో డిజిటలైజేషన్ తగినం తగా, సమానంగా పూర్తయ్యే వరకు తదుపరి దశలకు వెళ్లకూడదని మనవి చేస్తున్నాం. దూర ప్రాంతాలు, గిరిజన, అటవీ, నెట్వర్క్ లేని ప్రాంతాల్లో గడువు పొడిగింపు అవసరం. కావున జూలై 14తో ముగియనున్న ప్రస్తుత ఎస్ ఐఆర్ షెడ్యూల్ను అదనంగా ఒక నెల పొడిగిం చాలి. ఓటర్ల హక్కులను పరిరక్షించేందుకు అవ సరమైన ఇతర ఆదేశాలు జారీ చేయాలి. 

Back to Top