ఢిల్లీ: మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం అన్యాయమని వైయస్సార్‌సీపీ లోక్‌సభ పక్ష నేత మిథున్‌రెడ్డి మండిపడ్డారు. 24 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన భూమిపై ఇప్పుడు వివాదం సృష్టించి, బుల్డోజర్‌తో కాంపౌండ్ వాల్‌ను కూల్చడం దారుణమన్నారు. ప్రభుత్వ విధానాలు, ప్రజా సమస్యలపైనే భూమన కరుణాకర్‌రెడ్డి ప్రశ్నిస్తున్నారని, ఎవరినీ వ్యక్తిగతంగా దూషించే వ్యక్తి కాదని మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, మానసికంగా ఇబ్బంది పెట్టేందుకు ఆస్తులను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలకు భూమన కరుణాకర్‌రెడ్డి భయపడే వ్యక్తి కాదని స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వ అరాచకాలను వైయస్సార్‌సీపీ కలిసికట్టుగా ఎదుర్కొంటుందని, ప్రజాక్షేత్రంలో తెలుగుదేశం పార్టీకి తగిన బుద్ధి చెబుతామని మిథున్‌రెడ్డి పేర్కొన్నారు.