పులివెందులకు బ‌య‌లుదేరిన‌ సీఎం వైయ‌స్ జగన్‌

ఎన్నికల నేపథ్యంలో సాయంత్రం పులివెందులకు ముఖ్య‌మంత్రి

రేపు బాకరాపురంలో  ఓటు వేయనున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్ 

 

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎన్నిక‌ల నేప‌థ్యంలో పులివెందుల బ‌య‌లుదేరారు.  దాదాపు రెండు నెలలపాటు ప్రచారంలో హోరెత్తించిన ముఖ్యమంత్రి.. నిన్న పిఠాపురంలో జరిగిన సభతో ప్రచారానికి తెర వేశారు. కాగా.. ఈ ఎన్నికల్లో గెలుపుపై ధీమాతో ఉన్నారు సీఎం వైయ‌స్ జగన్.. సాయంత్రం తన సతీమణి వైయ‌స్ భారతితో కలిసి పులివెందులకు వెళ్తున్నారు. రేపు తాను పోటీ చేస్తున్న సొంత నియోజకవర్గంలోని బాకరపురంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.  అనంతరం తిరిగి తాడేపల్లికి రానున్నారు సీఎం వైయ‌స్ జగన్.  

Back to Top