వైయస్ఆర్ జిల్లా: ప్రొద్దుటూరులో జరిగిన మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకకు మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. వైవీఆర్ కళ్యాణమండపం ఎదురుగా ఉన్న గ్రౌండ్‌లో నిర్వహించిన ఈ వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో నూతన వధూవరులు కృష్ణ కావ్య, వినీత్ రెడ్డిలకు వైయస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. వధూవరులను ఆశీర్వదిస్తూ వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. వైయస్ జగన్ రాకతో కార్యక్రమం మరింత ఉత్సాహభరితంగా మారింది.