ఎల్లోమీడియా త‌ప్పుడు క‌థ‌నాల‌పై ఈసీ స్పందించ‌డం లేదు 

 వైయ‌స్ఆర్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి 

తాడేప‌ల్లి:  ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరించిన చంద్రబాబు, ఎల్లోమీడియాపై అనేకసార్లు ఈసీకి ఫిర్యాదు చేసినా స్పందించ‌డం లేద‌ని  వైయ‌స్ఆర్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

 • భువనేశ్వరి మూడు లక్షల చొప్పున నగదు పంపిణీ చేస్తుంటే ఫిర్యాదు చేసినా ఈసీ పట్టించుకోలేదు
 • ఎల్లోమీడియా తప్పుడు కథనాలపై ఫిర్యాదు చేసినా ఈసీ సరైనరీతిలో స్పందించలేదు.
 • పవన్ కళ్యాణ్, లోకేష్ లు జగన్ గారిని చంపండి, రాళ్లతో కొట్టండంటూ క్రిమినల్ నేచర్ తో మాట్లాడిన అంశాలపై ఫిర్యాదు చేసినా స్పందన లేదు.
 • దీన్నిబట్టి ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయనే నమ్మకం లేకుండా పోయింది
 • కూటమి నేతలు ఎవరిపై ఫిర్యాదు చేస్తే ఆ అధికారిని బదిలీ చేశారు. అధికారులలో ఆత్మస్ధైర్యం కోల్పోయాలా ఆదేశాలు వచ్చాయి.
 • ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద కూడా కూటమి నేతలు దుష్ప్రచారం చేస్తున్న అంశంపై పలుమార్లు ఫిర్యాదు చేశాం.
 • ల్యాండ్ టైట్లింగ్ యాక్టు కాపీలను కాల్చిన వారిపై కేసులు పెట్టాలని ఈసీని కోరాం
 • కూటమి నేతలు వివిధ ఎంసిసి ఉల్లంఘనలపై ఇప్పటికి 300 ఫిర్యాదులు చేసినా ఈసీలో స్పందన లేదు
 • మోదీ, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లాంటి పెద్దలు ఏపీకి వస్తే రాష్ట్ర భవిష్యత్తు గురించి కూటమి నేతలు చర్చించలేదు
 • రాష్ర్ట ప్రయోజనాలకు సంబంధించి ఎలాంటి హామీలూ తీసుకోలేదు.
 •  
 • 2014లో న్యాయవాదులకు చంద్రబాబు 18 హామీలు ఇచ్చి, ఒక్కటి కూడా నెరవేర్చలేదు
 • వైయస్ జగన్ 2019లో ఇచ్చిన హామీలలో 99 శాతం అమలు చేసి చూపించారు
 • జూనియర్‌ న్యాయవాదులకు లా నేస్తం పేరుతో నిధులు ఇచ్చారు.
 • వంద కోట్ల రిజర్వ్ ఫండ్ ఏర్పాటు చేసి న్యాయవాదులకు అండగా నిలిచామ‌ని మ‌నోహ‌ర్‌రెడ్డి తెలిపారు.
Back to Top