చంద్ర‌బాబు, ఆర్‌టీవీ, ఈనాడుపై ఈసీకి ఫిర్యాదు

అమ‌రావ‌తి:  ఎన్నికల  నియమావళికి విరుధ్దంగా ప్రవర్తిస్తున్నచంద్రబాబుపై, ఆర్‌టీవీ, ఈనాడు పత్రికలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్నికల సంఘానికి వైయ‌స్ఆర్‌సీపీ ఫిర్యాదు చేసింది. పార్టీ ఎమ్మెల్యే మల్లాదివిష్ణు, లీగల్ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు మనోహర్ రెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ గ్రీవెన్స్ సెల్ అధ్య‌క్షుడు  నారాయణమూర్తిలు ఎన్నికల అధికారులకు ఇందుకు సంబంధించి ఆదారాలను అందించారు.

1.చంద్రబాబునాయుడు చిత్తూరు, నంద్యాలలో ప్రచారసభలలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారిపై వ్యక్తిగత, అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కు విరుధ్దం.

2.ముఖ్యమంత్రి వైయస్ జగన్ మార్పింగ్ ఫోటోలు వేస్తూ వ్యక్తిగతంగా కించపరుస్తూ ఈనాడులో వార్తలు రాస్తున్నారు. దీనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు.అదేవిధంగా ఈనాడు ఎడిటోరియల్ పై ఫిర్యాదు చేశారు.

3. ఆర్‌టీవీ లో సర్వేల పేరుతో ప్రశాంత్ కిషోర్ తో రవిప్రకాష్ ఇంటర్వూ చేశారు. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కు విరుధ్దం. కాబట్టి ఆర్ టీవీపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. చిత్తూరు ,నంద్యాల సభల్లో చంద్రబాబు అప్రజాస్వామిక పదజాలం వాడారు.సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసారు. ఇప్పటి వరకూ 230 పిర్యాదులు ఈసీ కి ఇచ్చాం. ఎన్నికల సంఘం సరిగా స్పదించలేదు. కూటమి ఫిర్యాదులపై వెంటనే ఈసీ స్పందించింది. ఈసీ ప్రభావం పడకుండా ఉండేందుకే బీజేపీ తో చంద్రబాబు కూటమి కట్టారు.ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజా తీర్పును ఆపలేరు. ప్రజలు ధర్మం , న్యాయం , నిజం పక్కనే ఉన్నారు.  ప్రశాంత్ కిషోర్ ఇంటర్వ్యూ తో ఆర్ టీవీ కోడ్ ఉల్లంఘనకు పాల్పడింది. మనుగడ కోల్పోతున్నామన్న భయంతోనే సీఎం వైయ‌స్ జగన్ పై ముప్పేట దాడి చేస్తున్నారు.

  మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇచ్చిననాటి నుండి కూటమి అరాచకం పై అనేక ఫిర్యాదులు చేశాం. అయిన ఎన్నికల సంఘం చర్యలు తీసుకోలేద.కూటమి నేతలు చిన్న కాగితం ఇచ్చిన ఈసీ ఆఘమేఘాల పై చర్యలు తీసుకున్నారు. లూప్ లైన్ లో ఉన్న అధికారులు పై కూడా చర్యలు తీసుకున్నారు. అల్లు అర్జున్ వచ్చిన కూడా పోలీసులు పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. రామ్ చరణ్ పిఠాపురం వెళ్లి ప్రచారం చేసినా ఎటువంటి చర్యలు లేవు.ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించటం లేదు అని అర్ధం అవుతుంది. రేవు జరిగే ఎన్నికల్లో అయిన ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరుకుంటున్నాం.

     నారాయణమూర్తి మాట్లాడుతూ ఎన్నికల సంఘాన్ని మేనేజ్ చేయటం కోసమే బీజేపీ తో పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లాడారా అనే అనుమానం ప్రజల్లో కలుగుతుంది. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉన్నారు. రేపు పోలింగ్ సమయం లో ప్రజలు ఖచ్చితమైన తీర్పు ఇస్తారు.

Back to Top