చంద్ర‌బాబుపై ఈసీకి వైయ‌స్ఆర్‌సీపీ ఫిర్యాదు

అమ‌రావ‌తి: ఎన్నికల నియమావళికి విరుధ్దంగా ప్రవర్తిస్తున్నచంద్రబాబుపై ఎన్నికల సంఘానికి వైయ‌స్ఆర్‌సీపీ ఫిర్యాదు చేసింది. వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, లీగల్ సెల్ ఛైర్మన్  మనోహర్ రెడ్డి, గ్రీవెన్స్ సెల్ అద్యక్షుడు నారాయణ మూర్తిలు ఎన్నికల సంఘం ప్రదానాధికారి ముఖేష్ కుమార్ మీనా కు ఫిర్యాదు అందించి ఆధారాలను సైతం అందచేశారు.

చంద్రబాబు నాయుడు విశాఖపట్నం,ఏలూరు,ఉండి,ఒంగోలులలో ఎన్నికల ప్రచార సభలలో ప్రసంగిస్తున్నప్పుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారిపై వ్యక్తిగత,అనుచిత వ్యాఖ్యలు చేశారు.ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కు విరుధ్దం కాబట్టి చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Back to Top