విశాఖ: ప్రస్తుతం రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని వైయస్ఆర్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మండిపడ్డారు. ప్రజా సంక్షేమం గాలికి వదిలేసి కూటమి నేతలు తమ స్వప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని దుయ్య బట్టారు. విశాఖలో విలువైన భూములను కార్పొరేట్ సంస్థలకు అప్పనంగా అప్పగిస్తున్నారని విమర్శించారు. ఆసీల్ మెట్ట పార్టీ కార్యాలయంలో సుమారు వందమంది ఆయన సమక్షంలో వైయస్ఆర్సీపీలోకి చేరడం జరిగింది. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించాలని అప్పటి ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి మెడికల్ కాలేజ్ ల ఏర్పాటుకు కృషి చేస్తే నేటి కూటమి సర్కార్ ఆ కాలేజీలను ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్నారు. పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని కూటమి సర్కార్ దూరం చేస్తుందని ఆరోపించారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా కూటమినేతలు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత కచ్చితంగా వైయస్ఆర్సీపీ అధికారం చేపడుతుందని వెల్లడించారు. ★ వైయస్ఆర్సీపీలో వంద మంది చేరిక.. 30వ వార్డ్ ప్రెసిడెంట్ దశమంతలు మాణిక్యాలరావు ఆధ్వర్యంలో విశాఖ దక్షిణ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ సమక్షంలో 30 వ వార్డు మీద రెల్లి వీధి ప్రాంతం నుండి టీడీపీ నాయకురాలు యార్ణమ్మ తో సహా వంద మంది వైయస్ఆర్సీపీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఆర్ టి ఐ సెక్రటరీ దస్మాంతుల చిన్ని, జిల్లా ఆర్టిఐ ప్రెసిడెంట్ వడ్డాది దిలీప్, జిల్లా ఎస్సీ సెల్ వైస్ ప్రెసిడెంట్ కోన శంకర్,సౌత్ మహిళా ప్రెసిడెంట్ వాసుపల్లి బంగారమ్మ, వార్డు ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ సంతోషి, బంగారు బాబ్జి, వేణు, రమేష్, సౌత్ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ ఆకుల యెషు,గౌస్, గోవింద్ రాజ్, నారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.